https://oktelugu.com/

ఆ టీడీపీ సీనియర్ నేతకు సీబీఐ గట్టి షాక్

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పక్కా ఆధారాలతో మెల్లిమెల్లిగా టీడీపీ నేతలను మూసేస్తున్నారు.ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కూన రవిందర్ సహా తదితర వారిని జైలుకు పంపిన జగన్ ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని మరో టీడీపీ సీనియర్ నేతకు చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. Also Read: తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్.. షాకిచ్చిన జగన్!? టీడీపీ సీనియర్ నేత. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, మరికొందరు నివాసాలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 01:38 PM IST
    Follow us on

    సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పక్కా ఆధారాలతో మెల్లిమెల్లిగా టీడీపీ నేతలను మూసేస్తున్నారు.ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కూన రవిందర్ సహా తదితర వారిని జైలుకు పంపిన జగన్ ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని మరో టీడీపీ సీనియర్ నేతకు చిక్కులు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది.

    Also Read: తిరుపతి వైసీపీ ఎంపీ టికెట్.. షాకిచ్చిన జగన్!?

    టీడీపీ సీనియర్ నేత. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, మరికొందరు నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించడం సంచలనమైంది. కాంగ్రెస్ హయాంలోనే యరపతినేనిపై ఓ కేసు నమోదైంది. కానీ గత చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో సదురు టీడీపీ నేతపై ఈగవాలకుండా కాపు కాశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఉచ్చు బిగిసేలా చేసింది.

    తాజాగా సీబీఐ గురజాల సమీపంలో జరిగిన అక్రమ మైనింగ్ పై దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు, హైదరాబాద్ లోని 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. సోదాల సమయంలో కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అక్రమ మైనింగ్ ఎంతమేరకు జరిగిందో నిర్ధారించేందుకు శాటిలైట్ ద్వారా వాల్యుమెట్రిక్ విశ్లేషణ జరుపుతోంది.

    Also Read: మద్యం షాపులను వదలని సీఎం జగన్!

    టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17మంది అక్రమ మైనింగ్ చేశారని.. 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని గ్రామాల పరిధిలో అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాల్లో విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారనే అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్