
తిరుపతి లోక్ సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిని ఆ పార్టీ ఖరారు చేసింది. రెండు నెలల కిందట వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఎంపీ స్థానం ఖాళీగా ఏర్పడింది. దీంతో ఆయన కుటుంబ సభ్యలకే మళ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇక్కడి ఎంపీగా పోటీ చేసేందుకే పలువురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జగన్ నేత్రుత్వంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ సమీకరణాల మధ్య గురుమూర్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఫిజియోథెరఫిస్ట్ అయిన గురుమూర్తి జగన్ పాదయాత్ర సమయంలో నిరంతరం అతనిపాటే ఉంటూ చికిత్స చేశాడు. ఇక టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ప్రకటించగా వైసీపీ చివరి నిమిషంలో గురుమూర్తి పేరును ప్రకటించడం సంచలనంగా మారింది.