క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు

ప్రపంచ మహమ్మారి కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ, కొందరు చదువుకున్న మేధావులు మాత్రం వాటికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. కనీస బాధ్యతను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల 16న అమెరికాలోని డల్లాస్ నుంచి ఒక యువకుడు విజయవాడకు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తూ… చేతికి ట్యాగ్ వేశారు. అయితే, ఇవేవీ […]

Written By: Neelambaram, Updated On : March 27, 2020 5:28 pm
Follow us on

ప్రపంచ మహమ్మారి కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ, కొందరు చదువుకున్న మేధావులు మాత్రం వాటికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. కనీస బాధ్యతను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల 16న అమెరికాలోని డల్లాస్ నుంచి ఒక యువకుడు విజయవాడకు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తూ… చేతికి ట్యాగ్ వేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోని అతగాడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మచిలీపట్నం, పెదపారుపూడి మండలం భూషణగుల్లలోని తన బంధువుల ఇళ్లకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. ఆసుపత్రి ఆర్.ఎం.ఓ ఆదినారాయణ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు అతని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇతనికి కరోనా సోకిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపగా ఫలితాలు ఇంకా రాలేదని వైద్యులు తెలిపారు.