https://oktelugu.com/

రాష్ట్రానికి వచ్చే వారిని అనుమతించండి: ఏపీ హైకోర్టు

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారి విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రంలోకి అనుమతించాలని, లేనిపక్షంలో క్వారంటైన్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే ఆ వ్యక్తి ని క్వారంటైన్‌కు తరలించాలని సూచించింది. అదేవిధంగా క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి […]

Written By: , Updated On : March 27, 2020 / 05:37 PM IST
Follow us on

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారి విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రంలోకి అనుమతించాలని, లేనిపక్షంలో క్వారంటైన్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని, ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది

ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే ఆ వ్యక్తి ని క్వారంటైన్‌కు తరలించాలని సూచించింది. అదేవిధంగా క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసింది