https://oktelugu.com/

woman : ప్రపంచంలోనే పొట్టి మహిళ, పొడవు మహిళను పక్క పక్కన చూస్తారా? ఇదిగో వీడియో..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజా వీడియోను చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. నిజమండి భలే ఫన్నీగా ఉంది. అయితే ఇందులో పెద్ద కామెడీ ఉండదు. కానీ ఒకరు ప్రపంచంలోనే పొడువైన వారు, మరొకరు పొట్టి వారు. అంటే టోటల్ పొట్టి, పొడవులను పక్క పక్కన చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియాలో చూడవచ్చు. అయితే భారతదేశానికి చెందిన ప్రపంచంలోనే అతి చిన్న మహిళ టర్కీకి చెందిన అత్యంత పొడవైన మహిళను కలుసుకున్నారు. ఇద్దరు కలిసి అటూ ఇటూ తిరుగుతూ టీ కూడా తాగారు. పొడవైన మహిళ రుమీసా. పొట్టి మహిళ పేరు జ్యోతి. ఇక రుసేమియాను కలవడానికి జ్యోతి ఓ రూములోకి వెళ్లింది. ఆమె లోపలికి రాగానే, "నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది. దానికి జ్యోతి "నువ్వు కూడా." అని సమాధానం ఇస్తుంది. ఈ వీడియాలో ఇద్దరు మాట్లాడుకోవడం కామన్ గా కనిపిస్తుంది కదా.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 22, 2024 / 09:37 AM IST

    Can you see the shortest woman and the tallest woman in the world side by side? Here is the video..

    Follow us on

    woman  : కానీ ఈ వీడియోకు టన్నుల కొద్దీ లైక్‌లు, వీక్షణలు వచ్చాయి. ఇక ఈ వీడియోకు ఫుల్ గా కామెంట్లు కూడా వచ్చాయి. “వావ్. ఎంత అద్భుతమైన క్షణం” అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరు కామెంట్ చేశారు. “ఇది అద్భుతమైనది,” అని మరొకరు అన్నారు. మరొకరు ఎంత అందంగా ఉన్నారు ఇద్దరు అంటే వామ్మో పొట్టి పొడవు అంటూ తెగ కామెంట్లు చేశారు.

    ఇంతకీ ఈ రుమీసా ఎవరు? : ఈమె ఒక న్యాయవాది, పబ్లిక్ స్పీకర్, కార్యకర్త. 2021లో అత్యంత ఎత్తైన మహిళగా రికార్డును బద్దలు కొట్టింది. గతంలో అత్యంత ఎత్తైన యుక్తవయస్కురాలిగా రికార్డును కైవసం చేసుకుంది. రీసెంట్ గా చేసిన కొలతల ప్రకారం, ఆమె 215.16 cm (7ft 0.7in) ఎత్తు ఉంది. అయితే 1997లో జన్మించిన ఆమె వీవర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఆమె జీవితం మొత్తం శస్త్రచికిత్సలు, ఫిజియోథెరపీ వంటి వైద్యంతోనే నిండి ఉంటుందట. అయినా కానీ ఆమెకు తన కుటుంబం ఎంతో మద్దతు ఇస్తుందని, వారు తనను చాలా సంతోషంగా చూసుకుంటారని తెలిపింది.

    అయితే తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా పాఠశాలకు వెళ్లలేదట. కానీ హోమ్‌స్కూలింగ్ ద్వారా తన విద్యను పూర్తి చేసిందట. అంతేకాదు రెండు విభిన్న గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి రెండు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్‌లను అందుకుందట. ఔత్సాహిక స్వీయ-బోధన ఫ్రంట్-ఎండ్ డెవలపర్‌ గా ఎదిగింది ఈమె.

    పొట్టి పిల్ల జ్యోతి ఎవరు?

    భారతదేశంలోని నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతి ఐదు సంవత్సరాల వరకు ఈ ఎత్తు పెరిగిందట. ఆ తరువాత, ఆమె పెరగ లేదట. అంటే ఒక నిర్దిష్ట ఎత్తుకు మించి పెరగలేదు. అయితే జ్యోతి అకోండ్రోప్లాసియాతో బాధపడుతుంది. ఈమె మొదటి సారి ఓ ఛానెల్ లో కనిపించినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. అరె ఇంత చిన్నగా ఉందా? ఇంత పొట్టిగా ఎందుకు ఉంది అంటూ కామెంట్లు చేశారు. అప్పటి నుంచి తెగ వైరల్ గా మారింది జ్యోతి. అంతేకాదు ఓ సారి మికా సింగ్ పాట కోసం వీడియోలో కూడా కనిపించింది. రీసెంట్ గా ఓ అమెరికన్ హారర్ స్టోరీ సిరీస్ లో కూడా ఒక పాత్ర పోషించింది. ఈ గిన్నీస్ రికార్డు సాధించిన జ్యోతి తన వ్యాధి వల్ల అసలు బాధ లేదట. తనకు చాలా సంతోషంగా కూడా ఉంటుందట. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను చూసి, గుర్తించి తనతో ఫోటో దిగాలని అడిగితే చాలా ఆనందంగా అనిపిస్తుందట.