https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : యష్మీ, పృథ్వీ మధ్య గొడవలు.. రోహిణి క్యారెక్టర్ పై నిందలు వేసిన విష్ణుప్రియ!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం పెట్టిన మెగా చీఫ్ టాస్కులు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొదటి రౌండ్ లో యష్మీ , రోహిణి,పృథ్వీ, తేజ, విష్ణు ప్రియ గెలిచి రెండవ రౌండ్ కి క్వాలిఫై అవుతారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 09:29 AM IST

    Clashes between Yashmi and Prithvi.. Vishnupriya blames Rohini's character!

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం పెట్టిన మెగా చీఫ్ టాస్కులు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొదటి రౌండ్ లో యష్మీ , రోహిణి,పృథ్వీ, తేజ, విష్ణు ప్రియ గెలిచి రెండవ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. రెండవ రౌండ్ లో యష్మీ, పృథ్వీ అద్భుతంగా ఆడుతారు, కానీ దురదృష్టం కారణంగా ఓడిపోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా మూడవ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. ఈ మూడవ రౌండ్ లో మాత్రం ఫుల్లుగా గొడవలు జరుగుతాయి. నిన్నటి ఎపిసోడ్ లో ‘మెకానిక్ రాకీ’ మూవీ ప్రొమోషన్స్ కోసం హీరో విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లోపలకు ఒక ఆటో ని వేసుకొని వస్తాడు. ఈ ఆటో ని ఆయన తిరిగి తనతో పాటు తీసుకొని వెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్తాడు. ఎందుకు అలా చేసాడో లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం కాదు. కానీ పక్క రోజు ఆ ఆటో తో సీజన్ లోనే భారీ గొడవలు జరిగే ఎపిసోడ్ ఉంటుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే చీఫ్ కంటెండర్స్ గా నిల్చిన యష్మీ, విష్ణు, పృథ్వీ, రోహిణి, తేజ వంటి వారు బజర్ మోగినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆటోలో కూర్చోవాలి. ఈ టాస్క్ లో ఒకరిని ఒకరు నెట్టుకుంటూ, తమకి కావాల్సిన వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. పృథ్వీ కి యష్మీ సహాయం చేస్తుంది. కానీ పృథ్వీ మాత్రం అవకాశం దొరికినప్పుడు యష్మీ ని బయటకి నెట్టేస్తాడు. దీనికి యష్మీ కి బాగా కోపం వస్తుంది. అనవసరంగా సహాయం చేశాను అని అంటుంది. అది విన్న పృథ్వీ ‘యష్మీ..ఎమోషనల్ అవ్వకు’ అని అంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇది ఒక ఎట్టు అయితే విష్ణు ప్రియ, రోహిణి కి మధ్య జరిగిన గొడవ మరో ఎత్తు. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఈ రేంజ్ లో వ్యక్తిగత కామెంట్స్ ని చేసుకోవడం మనం ఇప్పటి వరకు చూసి ఉండము. విష్ణు ప్రియ రోహిణి తో మాట్లాడుతూ ‘నీ మాటల్ని బట్టి నీ క్యారక్టర్ ఏమిటో అర్థం అవుతుంది’ అని అంటుంది.

    అప్పుడు రోహిణి కి కోపం వచ్చి ‘క్యారక్టర్ గురించి మాట్లాడకు..అందరికంటే పృథ్వీ నా మొదటి ప్రయారిటీ అని చెప్పిన మనిషివి నువ్వు. ఈ టాస్క్ లో కూడా అదే చేసావు’ అని అంటుంది. ఆ తర్వాత ‘ముందుగా నిఖిల్ ని లైన్ లో పెట్టడానికి ప్రయత్నం చేసావు. అతనితో కుదరకపోవడంతో పృథ్వీ ని ట్రాక్ లో పెట్టావు’ అని అంటుంది. కచ్చితంగా విష్ణు ప్రియ నే ఇది మొదలు పెట్టింది, ఆమెదే మొదటి తప్పు. కానీ రోహిణి చేసిన దారుణమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అది చాలా నీచమైనది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇంతలా ఒక అమ్మాయి క్యారక్టర్ పై దారుణమైన నిందలు వేయడం ఇది వరకు మనం తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడు చూడలేదు. హిందీ, తమిళం బిగ్ బాస్ లో వీటికి మించే జరిగాయి కానీ, తెలుగు లో మాత్రం ఇదే తొలిసారి. దీనికి నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్ లో వీళ్లిద్దరికీ వార్నింగ్ ఇస్తాడా?, లేకపోతే ఎప్పటి లాగానే శనివారం ఎపిసోడ్ ని ఫన్ ఎపిసోడ్ గా మార్చేస్తాడా అనేది చూడాలి.