https://oktelugu.com/

Revanth Reddy: కాంగ్రెస్ రాజకీయాలను రేవంత్ కంట్రోల్ చేయగలరా?

రాజకీయాల్లోకి వచ్చి 17 సంవత్సరాల కాలంలో సీఎం సీటు పై రేవంత్ కూర్చోవడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల్లోనే సీఎం పీఠం దక్కించుకోవడం చిన్న విషయం కాదు.

Written By: , Updated On : December 6, 2023 / 09:56 AM IST
Revanth Reddy

Revanth Reddy

Follow us on

Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ. అక్కడ ఏదైనా చేయవచ్చు.. ఎంత మాట అయినా అనవచ్చు. నాయకత్వంపై విమర్శలు చేయవచ్చు.అలాంటి కాంగ్రెస్ నేతలను రేవంత్ కంట్రోల్ చేయగలరా? అంటే కచ్చితంగా చేయగలరు అన్న సమాధానం వినిపిస్తోంది. తాము ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్నామన్న ఒకే ఒక్క పాయింట్ ను పట్టుకొని.. తమకు ప్రాధాన్యం కావాలి, పదవులు కావాలి అంటూ పార్టీలో రచ్చ చేసేవారు అధికం. వారి విషయంలో రేవంత్ ఎలా డీల్ చేస్తారో అన్నది ఇప్పుడు ప్రశ్న.

రాజకీయాల్లోకి వచ్చి 17 సంవత్సరాల కాలంలో సీఎం సీటు పై రేవంత్ కూర్చోవడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల్లోనే సీఎం పీఠం దక్కించుకోవడం చిన్న విషయం కాదు. రేవంత్ దాన్ని చేసి చూపించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఉత్తంకుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నారు. పార్టీలో చేరిన చాలాకాలం వరకు రేవంత్ ఖాళీగా ఉన్నారు. చివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి చేతులు కట్టేశారు. ఆ సమయంలో ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారు అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు విస్తృతం చేశారు. అయినా సరే వీటన్నింటినీ తట్టుకొని రేవంత్ నిలబడ్డారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు.

రేవంత్ రెడ్డికి రాజకీయాలేవీ పూల పాన్పు కాలేదు. కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఏమి రాజకీయ కుటుంబంలో పుట్టలేదు. ఆర్థికంగా స్థితిమంతుడు కాదు. స్వయంకృషితోనే ఎదిగారు. మొదట టిఆర్ఎస్ లో పని చేశారు. కానీ కెసిఆర్ గుర్తించలేదు. తన సొంత రాజకీయ పంధాతో ముందుకు సాగారు. మొదట జడ్పిటిసి గా, తరువాత ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. తరువాత టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అనుకున్నది సాధించగలిగారు.

ఒకటి మాత్రం నిజం.. నిన్నటి వరకు కెసిఆర్ కు మించిన నాయకుడు తెలంగాణలో లేడు అన్నది ఒక విశ్లేషణ. ఇప్పుడు మాత్రం కెసిఆర్ కు దీటైన నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చాడన్నది మరో విశ్లేషణ. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు తట్టుకోగలడా అన్నది ఇప్పుడు ప్రశ్న? అయితే ప్రాథమిక స్థాయిలోనే అన్ని రకాల రాజకీయాలను చవిచూశారు. ఎన్నెన్నో వేధింపులు, కేసులు, జైలు జీవితం అనుభవించారు. కాంగ్రెస్ రాజకీయాలను అవపాసన చేసుకున్నారు.అందుకే తెలంగాణ పై రేవంత్ రెడ్డి బలమైన ముద్ర చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.