AP: అధికారపక్షాలకు చెక్.. ఏపీలో ఏం జరగబోతోంది?

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, చత్తీస్గడ్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్ తప్ప.. అన్ని రాష్ట్రాల్లో అధికార పక్షానికి షాక్ తగిలింది. అధికారపక్షం వైఫల్యాలతోనే ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.

Written By: Dharma, Updated On : December 6, 2023 9:52 am

Jagan

Follow us on

AP: దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికార పక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షాలకు షాక్ తగిలింది. ఈ ఏడాదిలో మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. ఐదు రాష్ట్రాల్లో విపక్షాలనే ప్రజలు అధికారం ఇవ్వడం విశేషం. మొన్నటికి మొన్న కర్ణాటకలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి,నిన్న తెలంగాణలో కాంగ్రెస్ కు అక్కడ ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఏపీలో సైతం అదే తరహా తీర్పు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, చత్తీస్గడ్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్ తప్ప.. అన్ని రాష్ట్రాల్లో అధికార పక్షానికి షాక్ తగిలింది. అధికారపక్షం వైఫల్యాలతోనే ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో సైతం ఇదే తరహా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు భిన్నంగా వస్తాయి. కానీ అందరి దృష్టి ఇప్పుడు ఏపీతో పాటు ఒడిశా పై ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో టిడిపి సంబరాలు చేసుకుంటుంది. ఏపీలో సైతం వైసీపీకి షాక్ తప్పదని భావిస్తోంది. అటు ఒడిస్సా లో మాత్రం ఈసారి ఎటువంటి తీర్పు వస్తుందోనని చర్చ నడుస్తోంది. ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ వారసుడిగా భావిస్తున్న ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండ్యాన్ బీజేడీలో చేరారు. దీంతో అక్కడ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. 2000 నుంచి నవీన్ పట్నాయక్ అధికారంలో ఉండడం విశేషం. అక్కడ కాంగ్రెస్ తో పాటు బిజెపి బాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీకి షాక్ లు తగులుతున్న తరుణంలో ఏపీతోపాటు ఒడిస్సాలో ప్రతిపక్షాలు నమ్మకం పెట్టుకున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.