https://oktelugu.com/

PK Team: పీకే టీంలో ఏపీలో పని చేయలేక పోతుందా?

PK Team: పొలిటికల్ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే)కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గత కొన్నేళ్లుగా పీకే పేరు రాజకీయాల్లో మార్మోమోగిపోతోంది. పీకే టీం ఏపార్టీకి వ్యూహాకర్తగా వ్యవహరిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి. పీకే వ్యూహాలు రాజకీయంగా ఎక్కువగా సక్సస్ అవుతుండటంతో అతడిని వ్యూహాకర్తగా నియమించుకునేందుకు పొలిటికల్ పార్టీలు క్యూ కడుతున్నాయి. దీంతో అతడికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాకర్తగా పని చేశారు. ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2021 / 02:05 PM IST
    Follow us on

    PK Team: పొలిటికల్ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే)కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గత కొన్నేళ్లుగా పీకే పేరు రాజకీయాల్లో మార్మోమోగిపోతోంది. పీకే టీం ఏపార్టీకి వ్యూహాకర్తగా వ్యవహరిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి. పీకే వ్యూహాలు రాజకీయంగా ఎక్కువగా సక్సస్ అవుతుండటంతో అతడిని వ్యూహాకర్తగా నియమించుకునేందుకు పొలిటికల్ పార్టీలు క్యూ కడుతున్నాయి. దీంతో అతడికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

    Stategist Prasanth Kishore

    2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాకర్తగా పని చేశారు. ఆయన సలహాలను జగన్మోహన్ రెడ్డి తూచ తప్పకుండా పాటించారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కు పీకే వ్యూహాలు తోడవడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను దక్కించుకుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పీకే టీం ఇతర రాష్ట్రాల్లో పని చేసేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోనూ ఇటీవల పీకే వ్యూహాకర్తగా ఉన్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. ఇక తెలంగాణలోనూ పీకే ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ విన్పిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ఆయన వ్యూహాకర్తగా పని చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్, బీజేపీలు ఆయన్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెల్సిందే. మరోవైపు పీకే రాకను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాగతిస్తున్నారు.

    ఇప్పటికే టీఆర్ఎస్ తో పీకే టీం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పీకే టీం టీఆర్ఎస్ తరుపున పని షూరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆపార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు నుంచే తాము సపోర్టు చేస్తున్న రాజకీయ పార్టీకీ ఫీడ్ బ్యాక్ ఇస్తూ వ్యూహాలను సిద్దం చేయడం పీకే టీం స్పెషాలిటీ. అన్ని పార్టీలకు పీకే టీం ఇలానే ముందస్తు ప్లాన్ ఇస్తూ ఆపార్టీల గెలుపునకు కృషి చేస్తుంది.

    అయితే ఏపీలో మాత్రం పీకే టీం ఇప్పటి వరకు రంగంలోకి దిగలేదు. గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ మీటింగ్ సమావేశంలో మంత్రులతో త్వరలోనే పీకే టీం ఏపీకి వస్తుందని చెప్పారు. వారికి సహకరించాలని కూడా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ నెలలో పీకే టీం ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. అయితే నేటికీ పీకే టీం ఏపీలో పని మొదలు పెట్టకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Also Read: విషాదం.. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదివరకు పోరాడిన వీరుడు?

    ప్రస్తుత పరిస్థితుల్లో పీకే టీం అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తే తమపై ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత తెలిసిపోతుందోనని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతన్నారు. తమ పోస్టుకే ఎసరు వచ్చేలా ఉండటంతో వీరంతా కూడా పీకే టీంకు పెద్దగా సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో పీకే టీం ఏపీలో గ్రామస్థాయిలో తిరిగి పార్టీ, ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకోవాలని తొలుత భావించారు.

    అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో లేవని గ్రహించిన పీకే టీం తిరిగి నియోజకవర్గాలకే పరిమితం కావటం మంచిదన్న భావిస్తున్నారు. దీంతో పీకే టీం గుట్టుచప్పుడు కాకుండా పని చేయటం.. అది కూడా తక్కువ మందితో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంతోనే పీకే టీం ఏపీలో రంగంలోకి దిగటానికి వెనుకాడుతుందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: గుత్తాకు కేసీఆర్ ఝలక్ యేనా?