Can Congress Opposition parties defeat BJP? : కరోనా లాక్ డౌన్ తర్వాత దేశంలోని అధికార బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకింది. ఆ వ్యతిరేకత బెంగాల్ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించింది. అరవీర భయంకరంగా ఉన్న బీజేపీని ఓడించగలమని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నిరూపించారు.
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే అధికారపక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. అలాంటప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటినప్పుడే అధికార పార్టీ మేలుకొని వాటిని నెరవేరుస్తుంది. అయితే దేశంలో ఇప్పుడు బీజేపీకి సరితూగలేక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కూటమి కట్టే దిశగా ఆలోచన చేస్తున్నాయి.
కాంగ్రెస్ బలపడితేనే ప్రాంతీయ పార్టీలు కూడా అంతే బలపడుతాయి. బీజేపీకి చెక్ పెట్టే స్థాయికి చేరుతాయి. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు బలహీన మవుతోంది. చుక్కాని లేని నావలా కాంగ్రెస్, ఆప్ ఆ స్థానాన్ని భర్త చేస్తాయా? నిలకడలేని ప్రతిపక్షాల రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ వీడియో..