Sridevi And Chiranjeevi : శ్రీదేవి అందుకే చిరంజీవి సినిమా వదులుకుంది !

Sridevi And Chiranjeevi : కొండవీటి దొంగ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీదేవిని ( Sridevi) అడిగితే చిరంజీవితో సమానంగా తన పాత్ర ఉండాలని డిమాండ్ చేసిందట. ఆమెకు అంత అహంకారమా ? అంటూ అప్పట్లో కొందరు నిర్మాతలు ఆమె పై విరుచుకుపడ్డారు. నిజానికి ఇందులో ఆమె తప్పు ఏమి లేదు. తెలుగు సినిమా రంగానికి తెలిసిన శ్రీదేవి వేరు, హిందీలో స్టార్‌ లకే స్టార్‌ గా గొప్ప వెలుగు వెలిగిన శ్రీదేవి వేరు. అదీ అసలు […]

Written By: admin, Updated On : September 2, 2021 6:15 pm
Follow us on

Sridevi And Chiranjeevi : కొండవీటి దొంగ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీదేవిని ( Sridevi) అడిగితే చిరంజీవితో సమానంగా తన పాత్ర ఉండాలని డిమాండ్ చేసిందట. ఆమెకు అంత అహంకారమా ? అంటూ అప్పట్లో కొందరు నిర్మాతలు ఆమె పై విరుచుకుపడ్డారు. నిజానికి ఇందులో ఆమె తప్పు ఏమి లేదు. తెలుగు సినిమా రంగానికి తెలిసిన శ్రీదేవి వేరు, హిందీలో స్టార్‌ లకే స్టార్‌ గా గొప్ప వెలుగు వెలిగిన శ్రీదేవి వేరు. అదీ అసలు సమస్య.

శ్రీదేవి స్టార్‌ డమ్ అర్థం చేసుకోవడంలో, ఆ అవకాశాలు ఇక్కడ కల్పించడంలో తెలుగు సినిమా రంగానికి చెందిన దర్శక నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. దాంతో శ్రీదేవి అహంకారి అనో, మరోటనో ప్రచారాలు కల్పించారు. శ్రీదేవి నాలుగేళ్ళ వయసులోనే ఒక తమిళ సినిమాలో బాల నటిగా తన కెరీర్ ప్రారంభించింది. పద్నాలుగో ఏట అడుగుపెడుతూనే హీరోయిన్ పాత్రలు చేయడం ప్రారంభించింది.

పైగా కెరీర్ తొలినాళ్లలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా రెండో సినిమానే “16 వయదినిలే”. ఇది భారతీరాజా తొలి సినిమా. చాలా విభిన్నమైన సినిమా, విభిన్నమైన రోల్ కూడా. హీరోయిన్‌ గా తన పాత్రకు చాలా విలువ ఉండడంతో శ్రీదేవి కూడా అద్భుతంగా నటించింది . మరోవైపు తమిళ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన పక్కా కమర్షియల్ సినిమాల్లోనూ నటించడం స్టార్ట్ చేసింది.

అలా తమిళ సినిమాల వరకూ చూస్తే శ్రీదేవి ఒక పక్క అభినేత్రి, మరోపక్క అందాల తార. కానీ తెలుగులో వచ్చే సరికి ఆమెకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే వచ్చాయి. దాంతో తెలుగు సినిమాలతో శ్రీదేవి బాగా విసిగిపోయింది. తనకు తెలుగు సినిమాల్లో నటించే స్కోప్ దొరకదు అనే అభిప్రాయానికి ఆమె వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేసింది.

ముఖ్యంగా కమల్‌తో కలిసి నటించిన “మూండ్రం పిరై” (తెలుగు డబ్బింగ్‌లో వసంత కోకిల) ఆమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటనను ప్రేక్షకులూ, సినిమా పరిశ్రమ ఇప్పటికీ మరచిపోలేదు. అందుకే అప్పటి నుండి ఆమె బలమైన పాత్రలు కోసం తాపత్రయ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే కొన్ని బలహీన పాత్రలకు దూరంగా ఉండేది. ఈ క్రమంలోనే శ్రీదేవి చిరంజీవి సినిమాని కూడా వదులుకుంది