Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు తో పవన్.. ఏపీ రాజకీయాలను మార్చేయగలరా?

Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు తో పవన్.. ఏపీ రాజకీయాలను మార్చేయగలరా?

Chandrababu- Pawan Kalyan: ఎట్టకేలకు చంద్రబాబుతో పవన్ జతకట్టారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి నడవనున్నట్లు బాహటంగా ప్రకటించారు. జనసేన ఆవిర్భావం తర్వాత 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో ఎన్డీఏ కు పవన్ మద్దతు తెలిపారు.2019 ఎన్నికల్లో మాత్రం దూరమయ్యారు. ఇప్పుడు కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు.బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.అదే జరిగితే2014 ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ పవర్ పాలిటిక్స్ కు ఆ పార్టీ దూరంగా ఉంది. సరైన విజయాలు అందిపుచ్చుకోలేకపోయింది. అయినా సరే పార్టీని పవన్ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ వచ్చారు.ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేన ఒక బలమైన శక్తిగా మారింది. అందుకు కర్త, కర్మ,క్రియ పవన్ కళ్యాణ్. అధికారం కోసం ఏనాడూ దేబిరించని తీరు, అధికార వ్యామోహం లేకపోవడం తదితర కారణాలు ప్రజలను దగ్గర చేశాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినా నిర్దిష్ట ఓటు శాతం దక్కించుకున్న ఏకైక పార్టీ జనసేన. జిల్లా అధ్యక్షులు లేరు, నియోజకవర్గ బాధ్యులు లేరు, మండల,గ్రామ కమిటీలు లేవు. అయినా సరే నిర్దిష్ట ఓటు శాతాన్ని కొనసాగించడం ఆషామాషీ విషయం కాదు. జనసేన ఇతర రాజకీయ పక్షాలను ఓడించడమే కాదు.. గెలిపించడంలో కూడా కీలక పాత్ర పోషించే స్థితిలోకి మారింది.

చంద్రబాబు పాలనా దక్షుడే. కానీ రాజకీయంగా చాలా తప్పిదాలు ఆయనకు శాపంగా మారాయి. అందుకే ప్రజలు ఆయన లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ అండ చంద్రబాబుకు దొరకడం ఒక అరుదైన అవకాశం. ఒక విధంగా చెప్పాలంటే జనసేనకు తెలుగుదేశం పార్టీ అవసరం అనే దానికంటే.. టిడిపికే జనసేన, పవన్ సపోర్ట్ అత్యంత ఆవశ్యం.ఈ రెండు పార్టీలు కలిస్తే అద్భుత ఫలితాలు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. జనసేనకు సైతం దాదాపు 12 శాతం వరకు ఓట్లు లభించాయి. 30 వేల ఓట్లకు పైగా జనసేన దక్కించుకున్న నియోజకవర్గాలు 20 కు పైగా ఉన్నాయి. 20 వేలకు పైచిలుకు ఓట్లు సాధించుకున్న నియోజకవర్గాలు మరో 10 వరకు ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. పవన్ సైతం ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజలు గుర్తించడం ప్రారంభించారు. చంద్రబాబు సీనియార్టీ, పవన్ సిన్సియారిటీ కలిస్తే జగన్కు ముచ్చెమటలు ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

టిడిపి, జనసేనల మధ్య పొత్తు అంశం ఈనాటిది కాదు. గత కొన్నేళ్లుగా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య వాతావరణం నడిచింది. రెండు పార్టీల శ్రేణుల మధ్య సైతం సహృద్భావ వాతావరణం నెలకొని ఉంది. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరడం శుభపరిణామం. అయితే సీట్ల పంపకం, ఓట్ల బదలాయింపు, ఎన్నికల క్యాంపెయిన్ వంటివి కీలకం. నమ్మదగిన మిత్రులుగా రెండు పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కలిసి పనిచేసేందుకు రెండు పార్టీల శ్రేణులు మానసికంగా సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో కొన్ని రకాల ఇబ్బందులను అధిగమిస్తే పొత్తులు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version