Srikanth Addala: క్లాస్ ఆ .. మాస్ ఆ..శ్రీకాంత్ అడ్ఠాల ఆఖరికి ఏ పక్క గెలుస్తారు..?

ఇక రెండవ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ తీస్తారు అనుకుంటున్న టైం లొ లవ్ స్టోరీ ల వైపు కాకుండా ఫ్యామిలీ వైపు తన దృష్టి మళ్లించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ మూవీస్ కి శ్రీకాంత్ అడ్ఠాల పెట్టింది పేరు అనిపించుకుంటారేమో అన్నట్టు మ్యాజిక్ చేశారు.

Written By: Swathi, Updated On : September 14, 2023 5:05 pm

Srikanth Addala

Follow us on

Srikanth Addala: కె విశ్వనాథ్, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటివారు క్లాస్ సినిమాలకు పెట్టింది పేరు. రాజమౌళి, బి గోపాల్, వివి వినాయక్ మాస్ సినిమాలకు పెట్టింది పేరు. జంధ్యాల.. అనిల్ రావిపూడి.. ఇలాంటి వాళ్ళు తమ కామెడీ మార్కుతో దూసుకుపోతుంటారు. ఇక సుకుమార్ లాంటివారు క్లాస్.. మాస్.. అని కాకుండా లాజిక్స్ తో మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు. ఇలా మన తెలుగులో ఒక్కో దర్శకుడిది ఒక్కో రూట్.

కానీ ఇప్పుడు తనది ఏ రూట్ అనేది అర్థం కాకుండా మధ్యలో చిక్కుకో ఉన్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్ఠాల. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమైన ఈ డైరెక్టర్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమాని ఎంతో క్లాస్ గా తీసి…ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఈ డైరెక్టర్ చాలా బాగా తీయగలుగుతారు అనుకునేలా చేశారు.

ఇక రెండవ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ తీస్తారు అనుకుంటున్న టైం లొ లవ్ స్టోరీ ల వైపు కాకుండా ఫ్యామిలీ వైపు తన దృష్టి మళ్లించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ మూవీస్ కి శ్రీకాంత్ అడ్ఠాల పెట్టింది పేరు అనిపించుకుంటారేమో అన్నట్టు మ్యాజిక్ చేశారు.

అయితే ఆ తరువాతే అసలైన కథ మొదలైంది.. శ్రీకాంత్ అడ్ఠాల తన మూడవ చిత్రంగా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ స్టోరీ తీస్తారు అనుకుంటున్న టైంలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని వరుణ్ తేజ్ తో ముకుంద సినిమా తీశారు ఈ దర్శకుడు. అయితే పెద్దగా ఏ ఫీల్ లేకుండా తీసిన ఈ సినిమా కేవలం మెగా హీరో వరుణ్ తేజ్ మొదటి సినిమా కావడంతో.. అలానే పాటలు బాగా ఉండటంతో.. పరవాలేదు అనిపించుకునేలా ఆడింది.

ఇక ముకుంద తర్వాత తనకి మరి లవ్ స్టోరీస్ లేదా ఫ్యామిలీ స్టోరీస్ కలిసి వస్తాయి అనుకున్నారేమో తెలియదు కానీ.. వెంటనే శ్రీకాంత్.. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమా మొదలుపెట్టాడు. కట్ చేస్తే సినిమా దిజాస్టర్ గా మిగిలింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కానీ కథ ఏమీ లేకపోవడంతో.. మహేష్ బాబు కెరీర్ లోనే ఒక పెద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది బ్రహ్మోత్సవం.

ఆ సినిమా ఎంతటి డిజాస్టర్ తెచ్చుకునింది అంటే ఇక ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ కి ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు అనుకున్నారు. కానీ అదృష్టం కొద్దీ ఏకంగా తన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరో వెంకటేష్ ని పట్టేశారు శ్రీకాంత్. ఈసారి డైరెక్ట్ కథ వద్దు అని రీమేక్ సినిమా వైపు తన మక్కువ చూపించాడు. అది కూడా తాను అప్పుడు దాకా తీయని ఒక రకమైన నాటు కథను ఎంచుకొని నారప్ప సినిమా తీశారు.

కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి నారప్ప పరవాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు నారప్ప సినిమా తర్వాత ఏకంగా పెద కాపు అనే ఫుల్ లెన్త్ వైలెంట్ మాస్ యాక్షన్ సినిమాతో మన ముందుకు రానున్నారు ఈ దర్శకుడు. సెప్టెంబర్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్ఠాల ఒక క్యారెక్టర్ లో కూడా నటించాడు. ఇదంతా చూస్తే అసలు శ్రీకాంత్ ఎలాంటి సినిమా తీయడంతో స్పెషలిస్ట్ అనేది అర్థం కావడం లేదు.

పూర్తిగా క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటారు అనుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారేమో తెలియదు కానీ… ప్రస్తుతానికి మాత్రం క్లాస్ కాక మాస్ కాక మధ్యలో చిక్కుకున్నాడు. మరి ఈ డైరెక్టర్ ఏ రకంగా సక్సెస్ అవుతారో తెలియాలి అంటే.. ఈ పెద కాపు సినిమానే నిర్ణయించాలి.