Plane Emergency Landing : విమాన ప్రయాణ ప్రపంచంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ఒక సాధారణ విషయం. విమానం ఏదైనా సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేదా ఏదైనా ఇతర సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, అనుమతి తీసుకొని ఏ దేశంలోనైనా ల్యాండ్ చేయవచ్చు. పాకిస్తాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ఏదైనా భారతీయ విమానానికి అనుమతి లభిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. భారతదేశం, పాకిస్తాన్ వంటి రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్న తలెత్తుతుంది. భారత విమానాలు పాకిస్తాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయగలదా లేదా అన్నది ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
అత్యవసర ల్యాండింగ్ కోసం నియమాలు ఏమిటి?
ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే విమానంలో ఏదైన సమస్యల తలెత్తినప్పుడు, లేదా బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో విమానాన్ని ఆపి వెంటనే ల్యాండ్ చేయాలి. అటువంటి పరిస్థితిలో, విమానం భారతదేశం లేదా మరే ఇతర దేశం నుండి అయినా, సమీప విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతించబడుతుంది. ఈ నియమం అంతర్జాతీయ విమాన ప్రయాణంలో సూచించబడింది. ఇది అన్ని దేశాలలో వర్తిస్తుంది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. రెండు దేశాల మధ్య విమాన రాకపోకలపై చాలాసార్లు సరిహద్దు వివాదాలు తలెత్తాయి. అయితే, అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనల ప్రకారం, భారత విమానం పాకిస్థాన్ గగనతలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వస్తే, అత్యవసర ప్రాతిపదికన ల్యాండ్ చేయడానికి పాకిస్తాన్ అనుమతి ఇవ్వాలి.
అంతర్జాతీయ విమానయాన నియమాలు
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ICAO) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక విమానం అత్యవసర ల్యాండింగ్ చేసే హక్కును కలిగి ఉంటుంది. ఆ సమయంలో సంబంధిత దేశం ఆ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించాలి. పాకిస్థాన్‌లో భారత విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలంటే, ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తత ఉన్నప్పటికీ, దానిని పాకిస్తాన్ ఆమోదించాలి. ఈ నియమం విమానం భద్రతకు సంబంధించినది.. ఇది చాలా ప్రధానమైనది. ఏదేమైనప్పటికీ, పాకిస్తాన్ తన దేశంలో ఏదైనా భారతీయ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు రాజకీయ, భద్రత గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత మాత్రమే ల్యాండింగ్‌ను అనుమతిస్తుంది.