https://oktelugu.com/

కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డితోపాటు వీరికి ప్రమోషన్

మరికాసేపట్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగబోతోంది. దేశం మొత్తం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు భారీగా మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారు. ఇక పనితీరు సరిగా లేనివారిని తొలగిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని కారణంగా తాజాగా ముగ్గురు రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇక కొత్తగా 20 మందికి పైగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రివర్గ రూపురేఖలు మారనున్నాయి. అనేక శాఖలకు కొత్త […]

Written By: , Updated On : July 7, 2021 / 04:40 PM IST
Follow us on

మరికాసేపట్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగబోతోంది. దేశం మొత్తం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు భారీగా మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారు. ఇక పనితీరు సరిగా లేనివారిని తొలగిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని కారణంగా తాజాగా ముగ్గురు రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇక కొత్తగా 20 మందికి పైగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు.

మరికొద్ది గంటల్లో కేంద్ర మంత్రివర్గ రూపురేఖలు మారనున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు.ప్రధాని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విస్తరణలో భారీ మార్పులే జరుగుతున్నాయి.

ఇప్పటికే కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రమేశ్ ఫొఖ్రియాల్ సహా కేంద్ర మంత్రులు పలువురు రాజీనామాలుచేయడం సంచలనమైంది. కొత్త వారికి వీరి స్థానంలో అవకాశం రానుంది.

ఇక కొందరు సహాయ మంత్రులకు ఈసారి తాజా విస్తరణలో కేబినెట్ మంత్రులుగా పదోన్నతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఆయా శాఖల్లో వారి పనితీరుతోపాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రమోషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది.

ఇక ఇప్పటిదాకా సహాయమంత్రులుగా ఉన్న జి. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, హర్ దీప్ సింగ్ పూరి, పురుషోత్తం రూపాలా, మనుసుఖ్ మాండవీయలను కేబినెట్ లోకి తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రధాని నివాసానికి రావాలని ఇప్పటికే వీరికి ఆహ్వానం అందింది. దీంతో ఈ ఉదయం వీరు లోక్ కళ్యాణ్ మార్క్ కు వెళ్లి మోడీని కలిశారు.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించనున్నట్టు సమాచారం. ఆయనను కేబినెట్ మంత్రిగా చేస్తున్నారని.. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అనురాగ్ ఠాకూర్, హరిదీప్ సింగ్ పూరిలు కూడా సహాయ మంత్రుల నుంచి కేబినెట్ మంత్రులుగా మారనున్నారని తెలుస్తోంది.