https://oktelugu.com/

కృష్ణా జలాలపై రాజీలేని పోరాటం: కేసీఆర్

కృష్ణా జలాల వినియోగంలో రాష్ర్ట వాటా, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తోందని విమర్శించారు. నదీ జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కోర్టుల ద్వారా తేల్చుకుంటామని చెప్పారు. జల వివాదంలో జరుగుతున్న తతంగాలను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. నదీజలాల వివాదంపై ప్రగతిభవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న […]

Written By: , Updated On : July 7, 2021 / 04:35 PM IST
Follow us on

KCRకృష్ణా జలాల వినియోగంలో రాష్ర్ట వాటా, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తోందని విమర్శించారు. నదీ జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కోర్టుల ద్వారా తేల్చుకుంటామని చెప్పారు. జల వివాదంలో జరుగుతున్న తతంగాలను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు.

నదీజలాల వివాదంపై ప్రగతిభవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, కృష్ణా బోర్డు సమావేశం, ప్రభుత్వ కార్యాచరణ, సాగునీటిపై వివక్ష తదితర అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్న వాటాలో తెలంగాణకు సైతం హక్కు ఉందని పేర్కొన్నారు. న్యాయపరంగా రావాల్సిన వాటాను సాధించి తీరుతామని వివరించారు.

తెలంగాణకు దక్కాల్సిన వాటాను నిర్ధారించాలని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రంపై కృష్ణా జలాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. కృష్ణాట్రైబ్యునల్, కృష్ణాబోర్డుల వద్ద మన వాదన వినిపిస్తున్నామన్నారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని కేసీఆర్ పేర్కొన్నారు.

కృష్ణా జలాలపై రాష్ర్టం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలపై అనుసరించాలనేదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో ఉన్నతాధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.