Jagan Vs Pawan Kalyan: వలంటీర్లను అడ్డం పెట్టుకుని.. పవన్ పై జగన్ రివెంజ్

పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేరుగా కేసు వేసే ధైర్యం లేక వాలంటీర్లను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన మహిళ వాలంటీర్ తో కోర్టులో కేసు వేయించారు. పవన్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ ప్రభుత్వం ముందుకు రాకపోవడం విశేషం. వలంటీర్లను ముందు పెట్టి పవన్ పై కక్ష సాధించాలని జగన్ సర్కార్ చూస్తోంది. అందులో భాగమే ఈ తాజా పిటిషన్ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : July 25, 2023 3:32 pm

Jagan Vs Pawan Kalyan

Follow us on

Jagan Vs Pawan Kalyan: నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుంది ఏపీలో పాలకపక్షం తీరు.వైసీపీ సర్కార్ ఏది చేసిన రాజకీయమే. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఎంచుకునేది అక్రమార్గమే. ఇప్పుడు పవన్ విషయంలో చేస్తున్నది కూడా అదే. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. వ్యవస్థాగత లోపాలపై, పాలనా వైఫల్యాల పై పోరాడుతుంటే వైసీపీ నేతలు వ్యక్తిగతవిమర్శలకు దిగుతున్నారు. తాజాగా వాలంటీర్లతో కోర్టులో కేసు వేయించారు.

పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేరుగా కేసు వేసే ధైర్యం లేక వాలంటీర్లను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా విజయవాడకు చెందిన మహిళ వాలంటీర్ తో కోర్టులో కేసు వేయించారు. పవన్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ ప్రభుత్వం ముందుకు రాకపోవడం విశేషం. వలంటీర్లను ముందు పెట్టి పవన్ పై కక్ష సాధించాలని జగన్ సర్కార్ చూస్తోంది. అందులో భాగమే ఈ తాజా పిటిషన్ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రజల వ్యక్తిగత గొప్యత సమాచారాన్ని వలంటీర్లు ద్వారా ఇతరులకు చేరుతుందని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థను ఒక రాజకీయ శక్తిగా మార్చుకున్నారని జగన్ పై పవన్ ఆరోపణలు చేశారు. ఎక్కడ దీనిపై జగన్ నేరుగా క్లారిటీ ఇవ్వలేదు. అటు ప్రభుత్వ పరంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. పవన్ వ్యాఖ్యలతో వలంటీర్లు వ్యవస్థపై బలమైన చర్చ నడిచింది. ప్రజల సైతం అనుమానపు చూపులు ప్రారంభించారు. అయితే దీనిపై జగన్ సర్కార్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పవన్ పై ఎదురుదా డినే కొనసాగించింది.

పవన్ పై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తనపై కేసులు పెట్టుకున్న బెదిరేది లేదని పవన్ తేల్చి చెప్పారు. ఈ తరుణంలో విజయవాడకు చెందిన మహిళ వాలంటీర్ తో కోర్టులో కేసు వేయించారు. దీని వెనక ప్రభుత్వ హస్తం ఉంది. కానీ ఎక్కడ బయట పెట్టట్లేదు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ వాలంటీర్లతో పవన్ పై యుద్ధం చేస్తున్నారు. పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేందుకే జగన్ సర్కార్ ఇటువంటి చర్యలు దిగుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో దూకుడుగా వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ పై న్యాయపోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఓ మహిళా వాలంటీర్ని అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ చేసిన చర్య మాత్రం విస్తు గొలుపుతోంది.