ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయింది. ఇంతలోనే ఉప ఎన్నికలు ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ.. మీరు వింటున్నది నిజమే.. త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు జరిగడం ఖాయంగా కన్పిస్తుంది. కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151సీట్ల బంపర్ మెజార్టీని సాధించి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజారంజాక పథకాలు ప్రవేశపెడుతూ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.
విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం
ఏడాది కాలంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చాలావరకు అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. పాలన చేపట్టిన తొలిరోజుల్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం పాలనలో పట్టుసాధించి ఏపీ ప్రగతిపై దృష్టిసారించారు. ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. గత ఎన్నికల్లో చావుదెబ్బతిన్న టీడీపీ ఏడాది కాలంగా ఇంకా కోలుకున్నట్లు కన్పించడం లేదు. టీడీపీ నైరాశ్యంలో ఉండటంతో ఆ పార్టీ చెందిన పలువురు నేతలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు.
వైసీపీలోకి టీడీపీకి చెందిన కిందిస్థాయి నాయకులను పెద్దఎత్తున చేరుతున్నారు. అయితే ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం వైసీపీ హోల్డులో పెట్టింది. వీరంతా లోపాయికారిగా వైసీపీకి మద్దుతు ఇస్తున్నారు. చంద్రబాబులా తాను నీచరాజకీయాలు చేయలేనని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలోకి చేర్చుకుంటానని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. దీంతో టీడీపీ చెందిన పలువురు నేతలు రాజీనామా చేసి వైసీపీ గుర్తుపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏపీలో త్వరలోనే ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!
సొంతపార్టీలోని వైరిపక్షంగా వ్యవహరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజుపై ఆ పార్టీ వేటువేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ను కలిసి అనర్హత వేటువేయాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రేపేమాపో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కన్పిస్తుంది. అదేవిధంగా టీడీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఆ పార్టీకి రాజీనామాచేసి వైసీపీ తరుఫున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారని టాక్ విన్పిస్తుంది.
వీరి విషయంలో జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఏడాది పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలు మారనుండటంతో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.