https://oktelugu.com/

జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?

తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య నీటియుద్దం మొదలయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు తెలంగాణా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలంగాణా ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొదటినుండి సఖ్యతగా మెలుగుతున్న సీఎం లమధ్య నీటి వినియోగం విషయంలో, విభేదాలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లో జగన్ సీఎం కావడాన్ని కేసీఆర్ స్వాగతించారు. వైస్సార్ సీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తుకట్టి తనపై పోటీకి దిగడంతో కేసీఆర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 03:03 PM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య నీటియుద్దం మొదలయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు తెలంగాణా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలంగాణా ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొదటినుండి సఖ్యతగా మెలుగుతున్న సీఎం లమధ్య నీటి వినియోగం విషయంలో, విభేదాలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ లో జగన్ సీఎం కావడాన్ని కేసీఆర్ స్వాగతించారు. వైస్సార్ సీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తుకట్టి తనపై పోటీకి దిగడంతో కేసీఆర్ కి బాబు శత్రువు అయ్యాడు. శత్రువు యొక్క శత్రువు మన మిత్రుడు అవుతాడు గనుక జగన్ తో సాన్నిహిత్యం కేసీఆర్ పెంచుకున్నాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఘన విజయం సాధించాక, 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ ప్రభుత్వం గెలవాలని కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లే జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుండి ఈ ఇద్దరు సీఎంలు చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

    విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

    ఐతే కొద్దిరోజుల క్రితం జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ పై ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లోని నీటిని వాడుకొనేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలచిన ఆ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉందని, ఆ ప్రాజెక్ట్ ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణ రివర్ బోర్డుకు సూచనలు చేయడం జరిగింది. తెలంగాణా విభన చట్టానికి వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ న్యాయపోరాటం చేస్తాము అన్నారు. స్నేహితుడుగా ఉన్న జగన్ ని కేసీఆర్ మొదటిసారి ఈ ప్రాజెక్ట్ విషయంలో వ్యతిరేకించడం జరిగింది.

    జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

    తాజాగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నీటి సామర్ధ్యాని 17వేల క్యూసెక్కుల నుండి 50వేల క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం కుడి కాలువ సామర్ధ్యం పెంచితే తెలంగాణా నష్టపోతుందని గోదావరి బోర్డుకు తెలంగాణ అధికారులు లేఖ రాయడం జరిగింది. కృష్ణా గోదావరి నదుల నీటి వాటాలు, వాడుకలు ఈ ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు తేవడం ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ఇంతవరకు స్పందించనప్పటికీ భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం తప్పేలా లేదు.