YCP Women Leaders: ఏపీలో అధికార పార్టీ నేతల అక్రమాలు, ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. అడిగేవారు, అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అక్రమ దంగాలు, అసాంఘిక వ్యాపారాలు జోరుగా చేస్తున్నారు. మగవాళ్లకు తాము ఎందులోనూ తీసిపోము అన్నట్లుగా మహిళా నేతలు కూడా అసాంఘిక వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే ప్యాకాట క్లబ్‌లు నిర్వహించగా తాజాగా బెజవడాకు చెందిన ఓ మహిళా నేత యువతులతో వ్యభిచారం చేయిస్తోంది. ఇద్దరు యువతుల ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.

టీడీపీ నుంచి వైసీపీలో చేరి..
గతంలో టీడీపీలో ఉన్న ఓ యువనేత అనచరురాలిగా ఉన్న మహిళానేత ఎప్పుడూ హడావుడి చేస్తుంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే మహిళా నేతకు దుస్తుల దుకాణం ఉంది. ఆమె దుకాణానికి వచ్చే యువతుల్ని ట్రాప్ చేసి. యువనేతతో ఉన్న పరిచయాలను చూపించి.. మాయమటలు చెప్పేది. ఆకర్షితులైన వారి ఫోన్ నంబర్లను తీసుకుని మొదట పార్టీలకు తీసుకెళ్లేది. మద్యం అలవాటు అయిన తర్వాత మెల్లగా అర్ధనగ్న ఫొటోలు తీసి.. వాటితో తన వ్యాపారం ప్రారంభించేది. ఆ ఫోటోలను యువతులకే పంపి బెదిరించడమో లేకపోతే డబ్బులు బాగా వస్తాయని ఆశ పెట్టడమో చేసి.. వారిని వ్యభిచారకూపంలోకి దించేది. ఈ వ్యవహారంలో మోసపోయిన ఇద్దరు యువతులు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరిని ఇప్పటికే వ్యభిచార వృత్తిలోకి దింపడంతో.. రహస్య విచారణకు సీపీ ఆదేశించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఆ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది.
గ్యాంగ్ లీడర్‌తో కలిసి వ్యాపారం..
గతంలో రెండు గ్యాంగులు.. విజయవాడ నడిబొడ్డున కత్తులు, కటార్లతో దాడులు చేసుకున్న వ్యవహారం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అందులో ఓ గ్యాంగ్ లీడర్ అప్పుడే చనిపోయారు. ఇంకో గ్యాంగ్ లీడర్ బతికే ఉన్నాడు. ఆయనతో కలిసి ఈ మహిళా నేత ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆరోపణలు పెరిగిపోవడంతో.. వస్త్ర దుకాణం కూడా తెరవడం లేదు. ఇప్పుడీ వ్యవహారం విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వైసీపీ నేత చేసిన నీచమైన పని కావడంతో పోలీసులు బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధపడటం లేదు.

అప్పట్లో పేకాట క్లబ్‌ల నిర్వహణ ..
కర్నూలులో మంత్రి గుమ్మనూరు కుటుంబ సభ్యులు పేకాట క్లబ్‌లు నిర్వహించారు. ఈ విషయం సాక్ష్యాధారాలతో సహా బహిర్గతమైంది. తర్వాత తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పేకాటక్లబ్‌లో బాగోతం ఆధారాలతో బయటకు వచ్చింది. పేకాట క్లబ్‌లు నిర్వహించమని స్వయంగా ఎమ్మెల్యేనే ఆదేశాలు జారీ చేసిన ఆడియో అప్పట్లో వైరల్ అయింది.