Megastar Chiranjeevi New Look: మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. ఆయన ముందు కుర్ర హీరోలు కూడా బలాదూరే. ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల చేయడం ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఈ తరం స్టార్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. టైర్ టూ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతున్నారు. అలాంటిది 60 ప్లస్ లో ఉన్న చిరు మాత్రం వరుసగా సినిమాలు విడుదల చేస్తున్నారు. 2022 ఏప్రిల్ లో చిరంజీవి ఆచార్యగా థియేటర్స్ లో సందడి చేశాడు. మరో ఏడు నెలలకు అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ గా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు.

గాడ్ ఫాదర్ సూపర్ హిట్ కావడంతో పాటు ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. ఇది కదా మేము బాస్ నుండి కోరుకుంటుందని వారు కాలర్ ఎగరేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ మూవీలో బ్రహ్మ క్యారెక్టర్ లో చిరు మేనరిజమ్స్, యాటిట్యూడ్ ఫుల్ కిక్ ఇచ్చాయి. గాడ్ ఫాదర్ అనుభవాలు మందిలో నుండి వెళ్ళక ముందే వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా వాల్తేరు వీరయ్య విడుదలకు రెండు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. నవంబర్ 23న ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య కోసం దేవిశ్రీ ఊర మాస్ బీట్స్ తో ఐటెం నెంబర్ కొట్టారు. సదరు మాస్ బీట్ సాంగ్ కి చిరంజీవి స్టెప్స్ చూసిన జనాలు… వాట్ ఏ గ్రేస్ బాసు, అంటున్నారు. సాంగ్ లో ఆయన ఎనర్జీ, స్టెప్స్ చూస్తే కుర్ర హీరోలు కూడా కుళ్ళు కోవాల్సిందే. మన వల్ల కాదని చేతులు ఎత్తేయాల్సిందే. ఆ రేంజ్ లో రచ్చ చేశారు చిరు.

రేపు సంక్రాంతికి థియేటర్స్ దద్దరిల్లిపోనున్నాయని చిరు చెప్పకనే చెప్పాడు. ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చిరు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత రవితేజ కీలక రోల్ చేయడం. ఆయన పాత్రపై ఆడియన్స్ లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఇక శృతి హాసన్ చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.