Bumper offer for women : ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో ఉపకారక పథకాలను అమలు చేసింది. ప్రభుత్వం మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ సొంత కాళ్లపై నిలిచేలాగా, వ్యాపారవేత్తలుగా ఎదిగేలాగా వివిధ రకాల రుణాలు అందిస్తూ అలాగే శిక్షణలతో సహా అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఇప్పటివరకు మహిళల కోసం చాలా స్కీములో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రత్యేకమైన పథకం ఏంటో తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు కేవలం రుణ సహాయం అందించడం మాత్రమే కాకుండా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది.Tread అనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ద్వారా పెద్ద మొత్తంలో మహిళలు రుణం పొందే అవకాశం ఉంది. మహిళలు ఈ రుణంతో తమ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అలాగే వీళ్లు ఇతరులకు ఉపాధి కూడా కల్పించవచ్చు. మహిళలకు ఈ పథకం ద్వారా 30 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇక ఈ పథకంలో 70 శాతం వరకు బ్యాంకు రుణముగా అలాగే 30% కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు అందుతున్న సబ్సిడీగా ఉంటుంది.
ఈ రుణం అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఖాతాల నిర్వహణ వంటి అంశాలలో కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. కానీ మహిళలు ఈ పథకం కింద నేరుగా దరఖాస్తు చేసుకోలేరు. ముందుగా మహిళలు తమ స్వయం సహాయ సంఘం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. వాళ్లందరూ తమ వ్యాపార ప్రాజెక్టు వివరాలతో ఉన్న డిపిఆర్ ను బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత బ్యాంకు ఆమోదించిన తర్వాత మాత్రమే మహిళలు రుణం పొందుతారు.
Also Read : ఎటువంటి షూరిటీ లేకుండా మహిళలకు రుణం ఇస్తున్న ఎస్బిఐ…ఎంత రుణం వస్తుందంటే..
ఈ పథకం గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయిన msme.gov.in ను సందర్శించాలి లేదా మీకు సమీపంలో ఉన్న MSME డెవలప్మెంట్ ఇన్స్టిట్యూడ్, లీడ్ బ్యాంకు జిల్లా పరిశ్రమల కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. మహిళల పారిశ్రామిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ నారీశక్తి అనే ఒక ప్రత్యేక రుణం పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ఎలాంటి పూచికత్తు లేకుండా మహిళలు రెండు లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రుణం పొందవచ్చు. అయితే ఈ పథకంలో మహిళలకు 25% పూచికత్తుతో 10 కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది.