Women Loans : ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మహిళల కోసం ఎటువంటి హామీ లేకుండా తక్కువ వడ్డీ రుణ పథకాన్ని కూడా తీసుకొని వచ్చింది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అస్మిత అనే ప్రత్యేక పథకాన్ని మహిళల కోసం ప్రారంభించింది. వ్యాపారం చేస్తున్న మహిళలకు ఆర్థిక పరంగా సహాయం అందించేందుకు ఎటువంటి హామీ లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీ రుణ సదుపాయాన్ని కల్పించబోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీతో మహిళలకు ఆర్థికంగా సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు ఆర్థికపరంగా భరోసా కల్పించేందుకు విరివిగా రుణాలను అందిస్తుంది. ఎస్బిఐ మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ వాళ్ల వ్యాపారానికి మూడు శాతం ఎటువంటి షూరిటీ లేని రుణాలను మంజూరు చేస్తుంది.
అలాగే వ్యక్తిగత రుణాలు మరియు గృహ యాజమాన్యం కోసం 42 శాతం రుణాలను అందిస్తుంది. బంగారంపై తాకట్టు వంటి రుణాలకు వ్యక్తిగత ఆర్థిక లబ్ధి కోసం 38% రుణాలను అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలను స్వయం ఉపాధి కల్పించే విధంగా వాళ్ల వ్యాపారానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రత్యేక రుణాలను అందించడంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా నారీశక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఈ కొత్త ఆఫర్ ను ప్రారంభిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టౌన్సే ఇది సాంకేతిక ఆవిష్కరణకు మరియు సామాజిక ఇంజనీరింగ్ కలయిక అనీ ప్రకటించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే ఆధారిత నారీశక్తి ప్లాటినం డెబిట్ కార్డును మహిళలు ఆర్థికంగా ఎదగాలి అన్న లక్ష్యంతోనే ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ వడ్డీ ఉన్న రుణాలను పొందాలంటే మహిళలు బాబ్ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. ఈ ఖాతా ద్వారా మీరు అధిక వడ్డీని అందిస్తున్న బెస్ట్ పథకాలలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఖాతాలను ఓపెన్ చేసిన వారికి హోమ్ లోన్స్ మరియు వాహన రుణాలపై కూడా రాయితీలో ప్రాసెసింగ్ ఫీజుల్లో డిస్కౌంట్ లో అలాగే లాకర్ అద్దెపై కూడా 100% రాయితీ నీటితో పాటు విమానాశ్రయాలలో ఉచిత దేశీయ మరియు అంతర్జాతీయ లాంచ్ యాక్సెస్ తో పాటు వ్యక్తిగత డెబిట్ కార్డు వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి.