Homeజాతీయ వార్తలుUdan Scheme New Airports: విమానాలు.. ఆకాశహార్మ్యాలు.. కేంద్రం ఒక గొప్ప నిర్ణయం నగరాలను మార్చబోతోంది

Udan Scheme New Airports: విమానాలు.. ఆకాశహార్మ్యాలు.. కేంద్రం ఒక గొప్ప నిర్ణయం నగరాలను మార్చబోతోంది

Udan Scheme New Airports: కేంద్రం.. రవాణా రంగం అభివృద్ధికి దశాబ్దకాలంగా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ రహదారులను విస్తరిస్తోంది. కొత్త రైలు మార్గాలను వేస్తోంది. ఇదే సమంలో ఉడాన్‌ పథకంలో భాగంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్త విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తోంది. అయితే నగరీకరణ కారణంగా ఎత్తయిన భవనాలు పెరుగుతున్నాయి. స్థలం కొరత కారంగా ఎత్తయిన భవనాలకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. అయితే ఇవే విమానాల రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయి. […]

Udan Scheme New Airports: కేంద్రం.. రవాణా రంగం అభివృద్ధికి దశాబ్దకాలంగా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ రహదారులను విస్తరిస్తోంది. కొత్త రైలు మార్గాలను వేస్తోంది. ఇదే సమంలో ఉడాన్‌ పథకంలో భాగంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్త విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తోంది. అయితే నగరీకరణ కారణంగా ఎత్తయిన భవనాలు పెరుగుతున్నాయి. స్థలం కొరత కారంగా ఎత్తయిన భవనాలకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. అయితే ఇవే విమానాల రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విమానాశ్రయాల దగ్గర భవనాల ఎత్తు పరిమితులను తగ్గించే అధ్యయనం చేపట్టింది.

వేగంగా విమానయాన రంగం అభివృద్ధి
భారత దేశంలో విమానయానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ మార్కెట్‌లో మన విమానయానానికి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం 165 విమానాశ్రయాలు ఉన్నాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో మరో 50 విమానాశ్రయాలు వస్తాయని అంచనా.

అభివృద్ధికి అవకాశాలు
కేంద్రం తీసుకుంటున్న చర్యలతో విమానాశ్రయాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వాణిజ్య కేంద్రాలు, లాజిస్టిక్స్‌ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇదే సమయంలో ఐసీఏవో సహకారంతో పరిశీలనలు జరుగుతున్నాయి. ఎత్తు మార్పులకు కఠిన సాంకేతిక పరీక్షలు అవసరం. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి ఊపందుకుంటున్నప్పటికీ, సురక్షితమైన విమాన కార్యకలాపాలను నిర్ధారించడానికి విమానాశ్రయాల చుట్టూ ఉన్న భవనాలకు ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి.

ప్రధాన నగరాలపై దృష్టి..
పౌర విమానయాన రంగం నిరంతరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, విమానాశ్రయాల చుట్టూ ఉన్న భవనాలకు, ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి మహానగరాలలో ఎత్తు పరిమితులు సవాల్‌గా ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిష్కారాలను పరిశీలించడానికి, ఇప్పుడు ఒక అధ్యయనం నిర్వహించబడుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper