Homeజాతీయ వార్తలుUnion Budget 2025 Expectation : నేటి నుంచి అజ్ఞాతంలోకి ఆర్థిక మంత్రి.. తిరిగి కనిపించేది...

Union Budget 2025 Expectation : నేటి నుంచి అజ్ఞాతంలోకి ఆర్థిక మంత్రి.. తిరిగి కనిపించేది ఆ రోజే

Union Budget 2025 Expectation : ఉపాధి, అభివృద్ధి, శ్రేయస్సు గురించి ఈ ఏడాదికి సామాన్యుల కలల బ్లూప్రింట్ సిద్ధంగా ఉంది. శుక్రవారం సాయంత్రం హల్వా వేడుక (Halwa Ceremony)తో దేశ అంచనాల బడ్జెట్ పుస్తకం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) సూచించారు. ఈ పుస్తకం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌(Parliament)లో ఆర్థిక మంత్రి ప్రసంగంతో ప్రారంభం అవుతుంది. అప్పుడు దేశ ప్రజలు బడ్జెట్(Budget) పై కలలు కంటున్న ఆశల మేఘాలు కురిశాయో లేదా పిడుగుపాటుకు గురైందో తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ ద్రవ్యోల్బణాన్ని, రూపాయి పతనాన్ని, స్టాక్ మార్కెట్ పతనాన్ని, ఆదాయ వినాశనాన్ని ఎంతవరకు నియంత్రిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ(country’s economy)కు ఎంత బలాన్ని అందిస్తుంది అనేది ఫిబ్రవరి 1న మాత్రమే తెలుస్తుంది.

హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు?
భారతీయ సంప్రదాయంలో హల్వా (Halwa) తినడం సంతోషకరమైన సందర్భంగా పరిగణించబడుతుంది. అందువల్ల, బడ్జెట్ పూర్తిగా సిద్ధమైన తర్వాత హల్వాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ(Union Finance Ministry)లో తయారు చేసి, బడ్జెట్ తయారీలో పాల్గొన్న సిబ్బంది , అధికారులకు పంపిణీ చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో పాల్గొంటారు. పిటిఐ నివేదిక ప్రకారం.. శుక్రవారం జరిగిన హల్వా వేడుకకు హాజరు కావడంతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా సందర్శించి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ కూడా పాల్గొన్నారు.

ఒక వారం పాటు అజ్ఞాతంలోకి
హల్వా వేడుక తర్వాత బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ప్రసంగం ముగిసే వరకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వారి నివాసం నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఉంటుంది. అక్కడి నుండి వారు బయటకు వెళ్లలేరు లేదా మరే ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సంప్రదించలేరు. బడ్జెట్ గోప్యత లీక్ కాకుండా నిరోధించడం దీని ఉద్దేశ్యం. బడ్జెట్‌లో అలాంటి సమాచారం చాలా ఉంది. అది తెలిస్తే, దుర్వినియోగం కావచ్చు లేదా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular