Telangana Elections 2023: అత్తెసరుతో అనర్థమే.. తెలంగాణ ఓటరు ఆలోచించు!

ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు, సిద్దాంతాలు కనుమరుగయ్యాయి. అధికారం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతటికైనా దిగజారుతున్నారు. ఫిరాయింపుల చట్టం ఉన్నా.. దానిని లెక్కచేయకుండా పార్టీలు మారుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 27, 2023 3:02 pm
Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ఈసారి హోరాహోరీగా సాగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీలు తలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో ప్రకటన, ప్రచారంలో పోటీ ఇలా అన్ని అంశాల్లో టగ్‌ ఆఫ్‌ వార్‌ జరుగుతోంది. దీంతో సర్వే సంస్థలు కూడా ఈసారి గట్టి పోటీ తప్పదని ఇప్పటికే నివేదికలు విడుదల చేశాయి. ఎవరు గెలిచినా.. 60 నుంచి 70 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. కానీ, బీఆర్‌ఎస్‌ నేతలు వంద గ్యారెంటీ అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ 80కి ఒక్కటి కూడా తగ్గదని పేర్కొంంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓటరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

70 దాటితోనే సర్కార్‌..
ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు, సిద్దాంతాలు కనుమరుగయ్యాయి. అధికారం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతటికైనా దిగజారుతున్నారు. ఫిరాయింపుల చట్టం ఉన్నా.. దానిని లెక్కచేయకుండా పార్టీలు మారుతున్నారు. తననునమ్మి ఓటు వేసిన ప్రజల విశ్వాసాన్ని మరో పార్టీ వద్ద తాకట్టు పెడుతున్నారు. ఇక అధికారం కోసం పార్టీలను చీల్చడం సాధారణంగా మారింది. మోదీ ప్రధాని అయ్యాక ఈ పరిస్థితి పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో ఏపార్టీ అయినా 70 స్థానాలను మించి గెలిస్తేనే సర్కార్‌ ఏర్పాటు చయగలుగుతుంది. 60 నుంచి 70 మధ్య వస్తే మాత్రం.. అధికారం కోసం పార్టీలు మారడం ఖాయం. 2018 ఎన్నికల అనుభవం ఇదే చెబుతుంది. కాంగ్రెస్‌ నుంచి 19 మంది గెలిచారు. బీఆర్‌ఎస్‌కు మంచి మెజారిటీ వచ్చింది 88 స్థానాలతో సర్కార్‌ఏర్పాటు చేసింది. అయినా గులాబీ బాస్‌.. కాంగ్రెస్‌ను వీక్‌ చేయాలని 12 మందిని లాక్కున్నారు. సీఎల్పీ నేతగా దళితుడు కావడంతో.. అతని హోఓదా పోవాలని ఈ ప్లాన్‌ చేసినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. దళితుడు ప్రతిపక్ష నేతగా సభలో తనను ప్రశ్నించడం ఏంటని ఇలా చేశారని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈసారి కూడా అదే జరిగేది..
2023 అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మెజారిటీ తెలంగాణ సమాజం ఎవరికి ఓటెయ్యాల్లో నిర్ణయించుకోలేదు. మూడు ప్రధాన పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు వర్గాలుగా తెలంగాణ సమాజం విడిపోయినట్లు అనిపిస్తోంది. మెజారిటీ వర్గం కాంగ్రెస్‌వైపు, తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓటరు కీలక నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏ పార్టీ గెలిచినా మంచి మెజారిటీ వస్తేనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, బొటాబొటి మెజారిటీ వస్తే అస్థిరత ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Tags