Bigg Boss 7 Telugu – Ratika Rose : బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. గత వారం ఎలిమినేషన్ రద్దు చేసిన నేపథ్యంలో 12వ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. శనివారం అశ్విని శ్రీ ఎలిమినేట్ కాగా, ఆదివారం రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రతిక రోజ్ సోషల్ మీడియాలో పూర్తి నెగిటివిటీ మూటగట్టుకుంది. దీంతో 4వ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యింది.
అయితే ఆమెకు సెకండ్ ఛాన్స్ దక్కింది. ఎలిమినేట్ అయిన శుభశ్రీ, దామిని, రతికలలో ఒకరు తిరిగి షోలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. హౌస్ మేట్స్ ముగ్గురికి ఓట్లు వేయాలి, దాని ఆధారంగా ఒకరికి ఛాన్స్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. ఓటింగ్ ముగిశాక ట్విస్ట్ ఇస్తూ.. మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్లకు కాదు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని షాక్ ఇచ్చారు. ఈ కారణంగా రతిక రోజ్ కి మరో ఛాన్స్ దక్కింది.
రతిక రోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సరిగా సాగలేదు. బయట నుండి ఆట చూసి వచ్చాక ఆమె కన్ఫ్యూషన్ లో పడింది. అగ్రెసివ్ గా ఆడాలా లేక అందరితో మంచిగా ఉండాలా? అనే సందిగ్ధంలో పడింది. చాలా వరకు సేఫ్ గేమ్ ఆడింది. ఇక ఫిజికల్ టాస్క్ లలో రతిక రోజ్ పూర్తిగా ఫెయిల్. మైండ్ గేమ్స్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. రతిక ఎలిమినేట్ కాకుండా ఉండటానికి మరో రీజన్ లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇది కారణమైంది.
ఎలాగొలా 5 వారాలు నెట్టుకొచ్చింది. 12వ వారం ఎలిమినేట్ అయ్యింది. మొత్తంగా 9 వారాలు రతిక రోజ్ హౌస్లో ఉంది. వారానికి రూ. 2 లక్షలు ఒప్పందం పై రతిక హౌస్లో అడుగుపెట్టిందట. తొమ్మిది వారాలకు గాను రూ. 18 లక్షల రెమ్యూనరేషన్ రాబట్టిందట. రతిక ఇమేజ్ కి ఇది పెద్ద మొత్తమే. బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెట్టే అవకాశం కలదు. రతిక బిగ్ బాస్ జర్నీ ముగియగా ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి….