https://oktelugu.com/

MLC Kavitha: నెల రోజులకు కవిత దర్శనం.. కొండగట్టులో పూజలు.. అందుకోసమేనట..?

ఎమ్మెల్సీ కవితతోపాటు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కూడా కొండగట్టు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

Written By: , Updated On : May 10, 2023 / 06:55 PM IST
MLC Kavitha

MLC Kavitha

Follow us on

MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నెల రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఏప్రిల్‌ 11న తన కాలుకు గాయం అయిందని, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కనిపించారు. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

హనుమాన్‌ చాలీసా పారాయణం..
ఎమ్మెల్సీ కవితతోపాటు తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తదితరులు కూడా కొండగట్టు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్‌ చాలీసా పారాయణంలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. హనుమాన్‌ అంటే శక్తికి మూలమని, విజయానికి నిదర్శనమని కవిత పేర్కొన్నారు. మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని బీరప్ప ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫొటోలు షేర్‌చేసి..
కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈరోజు కొండగట్టును ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్టు పేర్కొన్నారు. అంజన్న అందరికీ ఆయురారోగ్యాలతో శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘రామ లక్ష్మణ జానకి, జయ్‌ బోలో హనుమాన్‌ కీ’ అని హిందీలో కోట్‌ చేశారు.