Ravi Teja Remuneration: ప్లాప్స్ తో సంబంధం లేదు… అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న రవితేజ!

రవితేజ అడిగిన రూ. 25 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అన్నారట. అసలు రవితేజ హిట్ చిత్రాల కలెక్షన్స్ పరిశీలించినా కూడా ఇది చాలా ఎక్కువ. బ్లాక్ బస్టర్ అంటున్న ధమాకా వరల్డ్ వైడ్ షేర్ రూ. 40 కోట్లు దాటలేదు. ఇక రావణాసుర షేర్ రూ. 12 కోట్లు లోపే. అంటే రావణాసుర కలెక్షన్స్ కి రెండింతలు రవితేజ రెమ్యూనరేషన్ గా అడుగుతున్నారన్న మాట.

Written By: Shiva, Updated On : May 10, 2023 6:58 pm

Ravi Teja Remuneration

Follow us on

Ravi Teja Remuneration: హీరో రవితేజ నెక్స్ట్ మూవీ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన భారీగా డిమాండ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. క్రాక్ మూవీతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. మరలా వరుస ప్లాప్స్ పలకరించాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్స్ అయ్యాయి. ధమాకా మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ధమాకా బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. ఇక వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అయితే వాల్తేరు వీరయ్య హిట్ క్రెడిట్ చిరంజీవికే ఇవ్వాలి. రవితేజది కేవలం గెస్ట్ రోల్ కాబట్టి. వాల్తేరు వీరయ్య అనంతరం రావణాసుర అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఇది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వరస్ట్ మూవీ అంటూ ప్రేక్షకులు ఎద్దేవా చేశారు. ప్లాప్స్ పడుతున్నా రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించడం లేదట. నెక్స్ట్ కలర్ ఫోటో ఫేమ్ సందీప్ తో సినిమాను ఓకే చేసిన రవితేజ రూ. 25 కోట్లు డిమాండ్ చేశారట. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానన్నారట.

రవితేజ అడిగిన రూ. 25 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే అన్నారట. అసలు రవితేజ హిట్ చిత్రాల కలెక్షన్స్ పరిశీలించినా కూడా ఇది చాలా ఎక్కువ. బ్లాక్ బస్టర్ అంటున్న ధమాకా వరల్డ్ వైడ్ షేర్ రూ. 40 కోట్లు దాటలేదు. ఇక రావణాసుర షేర్ రూ. 12 కోట్లు లోపే. అంటే రావణాసుర కలెక్షన్స్ కి రెండింతలు రవితేజ రెమ్యూనరేషన్ గా అడుగుతున్నారన్న మాట. సినిమాల బడ్జెట్ లో హీరోల పారితోషికాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో బడ్జెట్ పెరిగి హిట్ చిత్రాలకు కూడా నిర్మాతలకు పెద్దగా మిగలడం లేదు.

ఈ మధ్య డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కొంత సమకూరుతుంది. అది ప్లస్ అవుతుంది. కాగా రవితేజ నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో థియేటర్స్ లోకి రానున్నారు. దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేయడం విశేషం. ఇది ఆమెకు కమ్ బ్యాక్ చిత్రం.