BRS Leaders: చంద్రబాబుకు జై కొడుతున్న బీఆర్‌ఎస్‌ లీడర్లు.. దానికీ ఓ లెక్కుంది..!

ఏపీ మాజీ సీఎం అరెస్ట్‌ను తెలంగాణ అధికార పార్టీకి చెందిన నేతలు ఖండించడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఇందుకు ఓ లెక్కుందంటున్నారు విశ్లేషకులు. దీనికి ప్రధాన కారణం.. బాబు అరెస్ట్‌ను ఖండించిన వారంతా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే.

Written By: Raj Shekar, Updated On : September 19, 2023 12:59 pm
Follow us on

BRS Leaders: ఉమ్మడి రాష్ట్రానికి రెండ పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌ను నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. బాబు తనయుడు లోకేశ్‌ ఢిల్లీలో నిరసన తెలుపుతుండగా ఆయన తల్లి, చంద్రబాబు సతీమని భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజమండ్రిలో నిరసన తెలుపుతున్నారు. ఇది కామనే.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు బాబు అరెస్ట్‌ను ఖండించారు. ఇదీ కామనే.. ఇక ఐటీ ఉద్యోగులు అయితే హైదరాబాద్, బెంగళూర్‌లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇది కాస్త వెరైటీ.. ఇంకో వెరైటీ ఏంటంటే.. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడం.

తెలంగాణలో ర్యాలీలు..
అయితే తెలంగాణలో మాత్రం భారీ నిరసనలు జరుగుతున్నాయి. అన్ని చోట్లా జరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల ప్రదర్శనలపై పోలీసులుఉక్కుపాదం మోపినప్పటికీ ఇతర చోట్ల జరుగుతున్న నిరసనలకు మాత్రం సహకరిస్తున్నారు. దీనికి కారణం వీటిని వైసీపీ నేతలే ఆరెంజ్‌ చేస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. సుధీర్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు చాలా దగ్గర. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కూడా బాగా దగ్గరే. అయినా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మద్దతు లేకపోతే ఎల్పీనగర్‌ లో గెలవడం అసాధ్యమని ఆయనకు తెలుసని అందుకే ర్యాలీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు మల్లారెడ్డి లాంటి వారు కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్‌ అని జగన్‌మోహన్‌రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని అంటున్నారు. మరో వైపు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, వనమా వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. నిజామాబాద్‌ , నల్లగొండ, కోదాడ వంటి చోట్ల బీఆర్‌ఎస్‌ నాయకులు భారీ ర్యాలీలు తీశారు. ఇక హైదరాబాద్‌లోని కుషాయిగూడ సహా చాలా కాలనీల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అపార్టుమెంట్లు వారీగా మాట్లాడుకుని చంద్రబాబుకు సంఘిభావం చెబుతున్నారు. అత్యధికంగా ఎవరి ప్రమేయం లేకుండానే సంఘిభావం చెబుతున్నారు.

అంతా ఆ గూటి పక్షులే..
ఏపీ మాజీ సీఎం అరెస్ట్‌ను తెలంగాణ అధికార పార్టీకి చెందిన నేతలు ఖండించడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఇందుకు ఓ లెక్కుందంటున్నారు విశ్లేషకులు. దీనికి ప్రధాన కారణం.. బాబు అరెస్ట్‌ను ఖండించిన వారంతా టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. బాబు శిష్యులే. చంద్రబాబు వద్దనే వీరు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అందేకే తమ గురువుపై అభిమానాన్ని అలా చాటుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో కారణం.. నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కమ్మ ఓటర్లు, ఆంధ్రా సెటిలర్లు ఎక్కువ. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో వారికి విరుద్ధంగా ఉంటే.. ఇబ్బందులు తప్పవు. దీంతో కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి మౌనం..
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ చంద్రబాబుకు బద్ధ శత్రువు. తండ్రి తీరుగానే, తనయుడు, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ కూడా బాబును వ్యతిరేకిస్తారు. కానీ, ప్రస్తుతం ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. అయినా ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి మౌనంగా చూస్తున్నారు. దీనికి ఓ లెక్కుంది. కేసీఆర్‌ కూడా చంద్రబాబు శిష్యుడే.. కేటీఆర్‌ కూడా తన తండ్రి టీడీపీలో ఉన్నప్పటి నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. అందుకే వారు కూడా మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది.