Homeజాతీయ వార్తలుOld Parliament Building: ఏళ్ల పార్లమెంట్ భవనానికి వీడ్కోలు.. ఆ పాత భవనాన్ని ఇప్పుడు ఏం...

Old Parliament Building: ఏళ్ల పార్లమెంట్ భవనానికి వీడ్కోలు.. ఆ పాత భవనాన్ని ఇప్పుడు ఏం చేస్తారు?

Old Parliament Building: ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలకు, మరెన్నో వివాదాస్పద సంఘటనలకు కేంద్ర బిందువుగా ఉన్న పాత పార్లమెంటు భవనం ఇక గత చరిత్ర కానుంది. 97 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్లమెంట్ ను ఇకనుంచి వినియోగించరు. గురువారం నుంచి ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంటులో జరుగుతాయి. ఇప్పుడు ఆ పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు దేశ ప్రజల అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.. ఒకవేళ పాత భవనాన్ని కూల్చివేస్తారా? లేకుంటే ఇతర అవసరాలకు ఉపయోగిస్తారా? సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ భవనం అద్భుతంగా ఉండటమే కాకుండా.. భద్రత కోసం అత్యాధునిక పరికరాలు ఉపయోగించారు.

కొత్త పార్లమెంట్ భవనం పాత భవనం కంటే చాలా పెద్దది. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతోపాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్ ఉన్నాయి. ఇవే కాకుండా ఎంపీలు, త్రికయులకు రాయితీదారులకు ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది. పాత పార్లమెంట్ భవనానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు రూపొందించింది. వీటిని అమలులో పెట్టి.. పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తామో విస్పష్టంగా చెప్పింది.

1927లో బ్రిటిష్ వాస్తు శిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్డ్ బేకర్ పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి ఇప్పుడు 96 సంవత్సరాల పూర్తయి.. 97వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయరు. ఈ భవనానికి మరమ్మతులు చేసి, కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చుతారు. లోక్ సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనాన్ని పునరుద్ధరిస్తారు. ఇతర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే యోచనలో కేంద్రం ఉంది. భారత పార్లమెంటరీ చరిత్రను సామాన్య ప్రజలు తెలుసుకునే విధంగా భవనంలో కొంత భాగాన్ని మ్యూజియం గా మార్చుతారు. ఈ భవనాన్ని భారతదేశపు ముఖ్యమైన చారిత్రక వారసత్వ సంపదగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. భవన పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బాణంలోని నేషనల్ ఆర్కైవ్స్ కొత్త భవనానికి తరలిపోతుంది. దీంతో పాత భవనంలోని ఈ స్థలాన్ని సమావేశ గదిగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. కామెంట్ కొత్త భవనంలో ఎంపీల కోసం ఛాంబర్, విశ్రాంతి స్థలం, లైబ్రరీ, క్యాంటీన్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది..ఇందులో లోక్ సభ కు 880 సీట్లు, రాజ్యసభకు 300 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి సమావేశానికి 1280 సీట్లు ఏర్పాటు చేశారు. సౌండ్ సెన్సార్లతో సహా ఆధ్యాత్మిక సాంకేతికత కలిగిన కొత్త భవనంలో భద్రత కోసం అనేక లేయర్లు ఉపయోగించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version