Women: మహిళా బిల్లు పోరాటం ఇప్పటిది కాదు.. ఎక్కడ మొదలైందంటే?

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజ్వేషన్లు కల్పించాలని ఎప్పడి నుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 1998 జూలై 13న మహిళా రిజ్వేషన్ బిల్లును మొదటిసారిగా....

Written By: Neelambaram, Updated On : September 19, 2023 1:07 pm
Follow us on

Women: దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిసింది. సోమవారం సాయంత్రి భేటీ అయిన మంత్రి వర్గం మహిళా రిజర్వేషన్ బిల్లుపై సుధీర్ఘంగా చర్చించి.. ఆ తరువాత ఆమోదం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పోరాటం ఇప్పటిదీ కాదు. అంతేకాకుండా ఈ బిల్లును చాలా ప్రభుత్వాలు ఆమోదం కోసం ప్రయత్నించాయి. కానీ సాధ్యం కాలేదు. తాజాగా నరేంద్ర మోదీ క్యాబినేట్ ఆమోదం తెలిపినా లోక్ సభ, రాజ్యసభ ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా బిల్లుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలిస్తే..

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజ్వేషన్లు కల్పించాలని ఎప్పడి నుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 1998 జూలై 13న మహిళా రిజ్వేషన్ బిల్లును మొదటిసారిగా అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్ిర ఎం తంబిదురై లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆయన అప్పటి స్పీకర్ బాలయోగికి బిల్లుకు సంబంధించిన పత్రాలను సమర్పించగా ఆర్జేడీ ఎంపీ సురేంద్ర యావ్ సభ వెల్ లోకి వెళ్లి చింపేశారు.

ఆ తరువాత 1999 లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం పొందలేదు. 2002లో మరోసారి తీసుకొచ్చినా సాధ్యం కాలేదు. 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి ప్రభుత్వం రెండు సార్లు ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో మార్పులు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

2004లో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజ్వేషన్ పై హామీ ఇచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టగా బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ మహిళలకు కోటాలో కులం ప్రాతిపదికన ఉండాలని డిమాండ్ చేశారు. అయితే 2008లో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. 2010 మార్చి 9న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. కానీ సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి.

తాజాగా ఈ బిల్లును ఆమోదించడానికి కేంద్ర కేబినేట్ ఓకే చెప్పినా పార్లమెంట్ లో ఎటువంటి సంఘటనలో చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం నిర్వహించే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడుతారు. ఈ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొన్ని నెలల కిందట ఢిల్లీలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మహిలా బిల్లు ముందుకు వెళ్లడానికి కవితే కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.