Telangana Elections 2023: హైకమాండ్‌ సంకేతాలు : కాంగ్రెస్‌లో సీఎం క్యాండిడేట్‌ ఆయనేనా

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 9న సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్‌..బీజేపీకి వచ్చే సీట్లు.. పార్టీతో పాటుగా పాలన సమర్ధవంగా నిర్వహించే సామర్ధ్యం ఉన్న నేతకే పార్టీ హైకమాండ్‌ ప్రాధాన్యత ఇస్తుందనేది స్పష్టం అవుతోంది.

Written By: Raj Shekar, Updated On : December 1, 2023 11:43 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం ఖాయమా.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాక్ట్‌ పోల్స్‌ అవుతాయా.. కర్ణాటక రిజల్ట్‌ తెలంగాణలో రిపీట్‌ అవుతుందా.. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. అయితే బీఆర్‌ఎస్‌ మాత్రం ఇంకా ఆశల్లో కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారంం.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాబోయే సీఎం ఎవరు. రేవంత్‌ కు ఛాన్స్‌ ఉందా. సీనియర్లకు పట్టం కడతారా. సామాజిక సమీకరణాల్లో కలిసొచ్చేదెవరికి. కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం ఆశిస్తున్న వారు లాబీయింగ్‌ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఎవరిని సీఎం చేయాలో హైకమాండ్‌ ఇప్పటికే డిసైడ్‌ అయిందని, ఈమేరు సంకేతాలు కూడా ఇచ్చిందని తెలుస్తోంది.

రేసులో కీలక నేతలు..
సీఎం రేసులో కీలక నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో… ఇప్పుడు అధికారం దక్కితే.. దీని వేడి కొనసాగిస్తూ లోక్‌సభ సీట్లలో లబ్ది పొందేలా కాంగ్రెస్‌ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీని సామాజిక సమీకరణాల్లో ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలకే ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ప్రమాణస్వీకారంపై ఆసక్తి..
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 9న సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్‌..బీజేపీకి వచ్చే సీట్లు.. పార్టీతో పాటుగా పాలన సమర్ధవంగా నిర్వహించే సామర్ధ్యం ఉన్న నేతకే పార్టీ హైకమాండ్‌ ప్రాధాన్యత ఇస్తుందనేది స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేస్తారనేది పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న విశ్లేషణ.

బీజేపీని దెబ్బకొట్టే వ్యూహం..
కాంగ్రెస్‌ హైకమాండ్‌ మూడ్‌ క్లియర్‌ బీజేపీకి లోక్‌ సభ ఎన్నికల్లో లాభం కలగకుండా బీసీ లేదా ఎస్సీ వర్గానికి సీఎం పదవి ఇచ్చి.. రెడ్డి సామాజిక వర్గంతోపాటుగా ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారనేది మరో అంచనా. తిరిగి రెండున్నారేళ్ల తరువాత రెడ్డి వర్గానికి సీఎం పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా అండగా నిలిచిందని ఆ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. దీంతో.. ముందుగా రెడ్డి వర్గానికి చెందిన నేతకే సీఎం పదవి వరిస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.

బీజేపీ సీట్లపై నజర్‌..
తెలంగాణలో బీజేపీ అందరి అంచనాలను మించి సీట్లు దక్కించుకుంటుందనే లెక్కలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన టార్గెట్‌ బీజేపీ. దీంతో, బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం..ఎస్సీ వర్గీకరణ తో పాటుగా యువత బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపారానేది ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నివేదికలు అందాయి. దీంతో, సీఎం అభ్యర్ది విషయంలో సమర్దత..విధేయత..సామాజిక కోణం కీలకంగా మారుతోంది.