Brother Anil: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. జగన్ వ్యతిరేక శక్తులన్ని ఒక్కటవుతున్నాయి. ఇందులో భాగంగానే వ్యూహాలు మారుతున్నాయి. వైఖరులు ఖరారు అవుతున్నాయి. జగన్ కు గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన వారందరు ఎదురు తిరుగుతున్నారు. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టొద్దని జగన్ ఎంత మొత్తుకున్నా వినకుండా ఆమె పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో కూడా జగన్ షర్మిల మద్య అభిప్రాయ భేదాలు వస్తుండటంతో ఇప్పుడు బ్రదర్ అనిల్ కూడా జగన్ పై విమర్శలు చేస్తున్నారు.
జగన్ గెలుపు కోసం అప్పుడు చెల్లి, తల్లి, అందరు కలిసి పని చేశారు. కానీ ఇప్పుడు అందరు విభేదిస్తున్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జగన్ కు కష్టాలు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో జగన్ ఏ మేరకు వారిని శాంతింపచేస్తారనే దానిపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మధ్య బ్రదర్ అనిల్ తరచూ పర్యటనలు చేస్తూ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు ఇస్తున్నారు.
Also Read: తెలంగాణలో వయోపరిమితి పెంపుతో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమైందా?
మొదల రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. ఆయనతో మంతనాలు జరిపారు. సుదీర్ఘంగా రాజకీయాలపై చర్చించారు. తరువాత విజయవాడలో ఎస్సీ, బీసీ సంఘాలతో భేటీ అయ్యారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలో తెలియజేస్తానని చెప్పడంతో అందరిలో అంచనాలు మొదలయ్యాయి. పిమ్మట విశాఖలో కూడా క్రిస్టియన్, బీసీ సంఘాలతో సమావేశమై తన మనసులోని మాట చెప్పారు. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను బయటపెట్టారు.
దీంతో జగన్ కు ఇంటిపోరు ఎక్కువైపోతోంది. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్ లో అధికారం అందుకోవడం కల్లే అని తెలిసిపోతోంది. అందుకే దీనిపై జగన్ ఏ మేరకు స్పందించి పరిస్థితులు చక్కదిద్దుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఉన్నట్లు జగన్ ప్రస్తుతం ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సొంతింట్లోనే వేరు పార్టీలు పెడితే జగన్ కు తలనొప్పి అయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
Also Read: జగన్ గాలిలో గెలిచావ్ ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ ను ఓడించే దమ్ముందా?