Bihar Bridges : ఏదైనా నిర్మాణం చేపడితే పది కాలాలపాటు మన్నికగా ఉండాలనుకుంటాం. నిర్మాణ సంస్థలు కూడా ఈమేరకు ప్రమాణాలు పాటిస్తూ కట్టడాల నిర్మాణం చేపడతాయి. నిర్మాణ సమయంలోనూ క్వాలిటీని పరిశీలిస్తుంటారు. ఒక ఇంటి నిర్మాణం సమయంలోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక ప్రజల కోసం ప్రభుత్వాలు చేపట్టే నిర్మాణాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ బిహార్‌లో అలాంటి ప్రమాణాలు పటించినట్లు కనిపించడం లేదు. అందుకే ఆ రాష్ట్రంలో నిర్మింస్తున్న వంతెనటు పుట్టపుట్ట కూలిపోతున్నాయి. వరుసగా కూలిపోతున్న వంతెనలను చూస్తుంటే అవి బలమైన నిర్మాణాలా లేక పేకమేడలా అన్న సందేహం కలుగుతోంది.
15 రోజుల్లో ఏడు వంతెనలు..
బిహార్ రాష్రఫ్టంలో గడిచిన 15 రోజుల వ్యవధిలో ఏడు వంతెనలు కుప్పకూలాయి. తాజాగా సివాన్ జిల్లా డియోరియా ప్రాంతంలో గండక్ నదిపై చిన్న వంతెన నిర్మాంచారు. దీనికి కొన్ని రోజులుగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం(జూలై 3న) కొంత భాగం కూలిపోయింది. పది రోజుల క్రితం ఇదే జిల్లాలో ఓ వంతెన కుప్పకూలింది. పది రోజుల్లో రెండు వంతెనలు కూలిపోయాయి. తాజాగా కూలిన వంతెన 1982–83 మధ్య నిర్మించారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కూలినవి…
ఇక ఇటీవల బిహార్ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ నదిపై నిర్మించిన ఓ వంఎతన కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్, దిఘాల్ బ్యాంక్ బ్లాక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతకుముందు తూర్పు చంపారన్, సివాన్, ఆరారియా జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. ఇలా గడిచిన 15 రోజుల్లోనే 7 వంతెనలు కూలిపోవడం గమనార్హం. వరుస ఘటనలతో వంతెనల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వాహనాలు వెళ్తున్నప్పుడు కూలితే..
ఇక.. ఇప్పటి వరకు కూలిన వంతెనలు మొత్తం.. ఎవరూ లేని సమయంలో వాహనాలు వెళ్తున్న సమయంలో కూలిపోలేదు. కానీ, అవే వంతెనలు ప్రయాణికులు ఉన్న బస్సులు, పిల్లలు ఉన్న స్కూల్ బస్సులు వెళ్తున్న సమయంలో జరిగితే తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వంతెనల నాణ్యతను పరిశీలించాలని బిహార్ ప్రజలు కోరుతున్నారు.