బ్రేకింగ్: సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు 48వ సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ఇప్పటికే ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. బోబ్డే ఏప్రిల్ 23న రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 24 న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ […]

Written By: NARESH, Updated On : April 6, 2021 11:31 am
Follow us on

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు 48వ సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు.

సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ఇప్పటికే ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. బోబ్డే ఏప్రిల్ 23న రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 24 న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జస్టిస్ రమణ పదవీకాలం ఆగస్టు 26 వరకు ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి రమణనే. 1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణ జిల్లాలో రమణ జన్మించారు.

1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 సంవత్సరం జూన్ లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కు పదోన్నతి పొందారు.