
పాపం కొంతమందికి ఎప్పటికీ అదృష్టం రాదు, వాళ్లకు అన్ని ఉంటాయి.. కానీ ఏది అందదు. అందరూ గౌరవిస్తారు, కానీ స్థాయికి తగ్గ అవకాశం మాత్రం ఇవ్వరు. బ్యాడ్ టైం అనుకుని కెరీర్ లో బెటర్ మెంట్ కోసం ట్రై చేయాలని ఎంత కష్టపడినా.. ఉపయోగం లేకపోతే ఏమి చేయాలి ? అసలు, ఆమె చేసిన తొలి సినిమానే ఫ్లాప్. అతి కష్టం మీద రెండో సినిమా వచ్చింది, అది ఈ సారి ఇంకా పెద్ద ఫ్లాప్ అయి కూర్చింది. మరోపక్క ఆమె నటన పై విమర్శలు. అసలు బాలీవుడ్ నుంచి దిగొచ్చిన ఆ బ్యూటీకి మూడో సినిమాతోనే కెరీర్ రిస్క్ లో పడుతుందని ఎవ్వరూ ఉహించలేదు.
మొత్తానికి ఎన్నో రకాలుగా ఎన్నో కోల్పోయి ఒక ఏవరేజ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాకపోతే ఆ సినిమాలో ఆమెది సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్. అయితే ఏమి ? ఆ సినిమా మంచి హిట్టు అయింది. అలాంటప్పుడు ఆ హీరోయిన్ ఆ హిట్ ను ఎంతలా క్యాష్ చేసుకొవాలి ? కనీసం ఏవరేజ్ హీరోల సినిమాల్లో అయినా, మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ లు పట్టాలి కదా. కానీ, ఏమయ్యిందో ఏమో.. ఆ హీరోయిన్ మాత్రం ‘వ్యాంప్’ తరహా వేషాలేస్తోంది. అదీ కూడా చిన్నాచితకా హీరోల సినిమాల్లో. ప్రస్తుతం ఒక కొత్త హీరో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.
నిజంగా ఈ హీరోయిన్ పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతుంది. కొంచెం తెలివితేటలు ఉండి ఉంటే.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ ఉండేది. కానీ ఏమి చేస్తోంది. అమ్మడుకు అన్ని తెలివితేటలు లేవు. పైగా డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. కెరీర్ మొదటి నుంచీ ఈ బ్యూటీ తన ‘క్లీవేజ్ బీభత్సం’తో రెచ్చిపోతూ ఉంటుంది. అది తట్టుకోవడం కష్టమేనన్న బలమైన అభిప్రాయం చాలామందిలో వుంది ఇప్పటికీ. ఏమైనా ఈ భామ, తన ‘అందాల అతి ప్రదర్శన’ కారణంగా బ్యాడ్ ఇమేజ్‌ని తెచ్చుకుంది, అదే ఆమె కెరీర్ ను నాశనం చేసింది పాపం.