అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఒక మాజీ తహసీల్దార్ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోనే సంచలనం సృష్టించి అత్యంత ఎక్కువ లంచం తీసుకున్న ఒక అధికారి తనువు చాలించాడు. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ లో నాగరాజు ఉన్నారు. చంచల్ గూడ జైలులో కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?
అవినీతి, లంచం కేసులో నాగరాజు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలులో నాగరాజు రిమాండ్ ఉండగా.. ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కేసులో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్ గా ఉన్న నాగరాజు 28 ఎకరాల భూమికి పట్టాదార్ పాసు పుస్తకాలిచ్చేందుకు గత నెలలో 1కోటి 10లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతను గతంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండై తిరిగి విధుల్లో చేరాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరి తహసీల్దార్ అయ్యాడు.
ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఉన్నట్టు విచారణలో బయటపడడం సంచలనమైంది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.
Also Read: దుబ్బాకలో కొత్త హామీలు సరే.. పాతవి అటకెక్కినట్టేనా?
తెలంగాణలోనే అత్యంత అవినీతి కేసుగా కీసర లంచం కేసు ఖ్యాతికి ఎక్కింది. 1.10 కోట్లు లంచంగా తీసుకోవడంతో నాగరాజు జైల్లోనూ అవమానంతో ఎవరితో సరిగా మాట్లాడడం లేదని.. తినడం లేదని సమాచారం. ఇంటా బయటా తప్పు చేశానన్న ఫీలింగ్ కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.