https://oktelugu.com/

తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి

తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదివరకే చాలాసారు చెప్పారు. అన్నదాతకు అనుకూలంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే వారి నుంచి ప్రశంసలు పొందాడు. అంతే కాకుండా రైతువేదిక భవనాలను యుద్ధ ప్రాతిపదికగా నిర్మిస్తూ వారికి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా అన్నదాత కోసం ‘అగ్రికల్చర్‌ కార్డు’ను ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 08:54 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదివరకే చాలాసారు చెప్పారు. అన్నదాతకు అనుకూలంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే వారి నుంచి ప్రశంసలు పొందాడు. అంతే కాకుండా రైతువేదిక భవనాలను యుద్ధ ప్రాతిపదికగా నిర్మిస్తూ వారికి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా అన్నదాత కోసం ‘అగ్రికల్చర్‌ కార్డు’ను ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: అవమానమే పెనుభారమై.. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య

    రాష్ట్రంలో పంటల సాగు విధానంపై కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏయే పంటలకు మద్ధతు ధర ఎక్కువ వస్తుందో వాటినే సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాడు. ఇందుకోసం అధికారులు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. అందులో భాగంగానే రైతు వేదిక భవనాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్మిస్తున్నారు. ఇందులో రైతులందరూ ఒకేచోట సమావేశంపై పంటల సాగు విధానంపై చర్చించనున్నారు.

    వానాకాలం పంటల సమయంలోనూ కేసీఆర్‌ సన్నరకాల ధాన్యాన్నే పండించాలని సూచించారు. వాటికే మద్దతు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సంబంధిత అధికారులతో జరిగిన సమీక్షలోనూ కేసీఆర్‌ ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. ముఖ్యంగా మొక్కజొన్న సాగు అసలే వద్దని.. ఆ పంటకు మద్దతు ధర కేవలం రూ.800 నుంచి రూ.900 మాత్రమే వస్తుందన్నారు. అయినా వేసుకుంటమంటే అది రైతు ఇష్టమని, ప్రభుత్వం మాత్రం మద్దతు ధర కల్పించదని చెప్పారు.

    Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?

    ఇలా రైతును ప్రధానంగా చేస్తున్న కార్యచరణలో భాగంగా కేసీఆర్‌ ‘అగ్రికల్చర్‌ కార్డు’ను తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ ఆన్‌లైన్‌ చేసి కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చిన సీఎం ఇక రైతుకు ప్రభుత్వం నుంచి ‘అగ్రికల్చర్‌ కార్డు’ ను జారీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా రైతుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, దీంతో తనకు కావాల్సిన అవసరాలను అన్నదాత సమకూర్చుకుంటుంటాడని కేసీఆర్‌ నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది.