తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్… ఎందుకంటే..?

గడిచిన మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. లక్షల ఎకరాల పంట నీట మునుగుతోంది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏపీలో రాయలసీమలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నా వాయుగుండం కోస్తాంధ్రలో భీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో […]

Written By: Navya, Updated On : October 14, 2020 8:46 am
Follow us on

గడిచిన మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. లక్షల ఎకరాల పంట నీట మునుగుతోంది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

ఏపీలో రాయలసీమలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నా వాయుగుండం కోస్తాంధ్రలో భీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల నార్కట్‌పల్లి – అద్దంకి హైవే, భువనగిరి – చిట్యాల మార్గాలతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వాహనాలను దారి మళ్లించడానికి కూడా వీలు లేకుండా పోయిందని తెలుస్తోంది. రోడ్లు జలమయం కావడంతో ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు.

బలమైన ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లోని రిజర్వేయర్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్ లో గడిచిన వందేళ్లలో ఇదే అతిపెద్ద వర్షపాతమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.