Housing Scheme: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏ పని చేసినా వ్యతిరేకతలే వస్తున్నాయి. దీంతో ఆయనకు ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పథకంలో కూడా హైకోర్టులో చుక్కెదురైంది. మహిళలకే ఇళ్ల పట్టాలు కేటాయించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో అప్పీల్ చేయాలని భావిస్తోంది. సెంటున్నర స్థలాల్లో గృహ నిర్మాణ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంతో అనుమానాలు వ్యక్తం చేసింది.

రాష్ర్టవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే దీనిపై లోతైన ఆలోచన చేయాలని కోర్టు చెప్పింది. ఇళ్ల స్థలాలు చిన్నగా ఉండడంతో సదుపాయాలు చక్కగా ఉండడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు సరిగా న్యాయం జరగడం లేదని చెబుతోంది. కోర్టు జోక్యంతో ప్రభుత్వం ఇరుకున పడినట్లు అయింది.
ఇళ్ల పట్టాలు మహిళలకే ఇవ్వడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పురుషులకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. దీనిపై సర్కారు ఎందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని వాపోయింది. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో తెలపాలని సూచించింది. ఇరుకైన స్థలంలో ఇళ్లు నిర్మిస్తే మురుగు కాల్వల నిర్మాణం సంగతి ఏందని ప్రశ్నించింది.
జనసాంద్రతకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ విషయంలో పర్యావరణ, ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలతో కూడిన ముగ్గురు నిపుణులతో నెలరోజుల్లోగా కమిటీ వేయాలని స్పష్టం చేసింది.