https://oktelugu.com/

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇలాంటి సమయంలో ఇండియాలో తయారైన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 05:53 PM IST
    Follow us on


    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇలాంటి సమయంలో ఇండియాలో తయారైన హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ సంజీవని పని చేస్తుండటంపై పలుదేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

    ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ ను అమెరికాలో అధికారికంగా కరోనా ట్రీట్మెంట్లో వినియోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా ప్రధాని మోదీకి ఫోన్ చేసి మరీ ఈ మెడిసిన్ ను అమెరికాకు దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కరోనా రోగులపై మంచి ఫలితాలు ఇస్తుండటంతో చాలాదేశాలు తమకు ఈ మెడిసిన్ పంపించాలని భారత్ ను విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మందు కావాలని అడిగిన ప్రతీ దేశానికి లేదనకుండా సరఫరా చేసింది. ఇప్పటికే వందకు పైగా దేశాలకు భారత్ ఈ మందును సరఫరా చేసినట్లు సమాచారం.

    అయితే ఈ మందు వినియోగంపై పలువురు విమర్శలు గుప్పించారు. కరోనాకు ఈ మెడిసిన్ పనిచేయకపోగా వారికి ప్రాణాలకు మరింత ముప్పు కలుగుతుందని కొన్నిదేశాల్లో ఈ మందు వాడాకాన్ని తగ్గించారు. అయితే తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మెడిసిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసుల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. వైరస్ పట్ల తొలినాళ్లలో అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మాస్కు కూడా పెట్టుకోకుండా తిరగడంతో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కూడా కరోనా బారినపడ్డారు.

    బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!

    ప్రస్తుతం తాను కరోనా నుంచి వారంరోజుల్లోనే రికవరీ అయినట్లు బ్రెజిల్ అధ్యక్షుడు ప్రకటించాడు. తాను ప్రతీరోజు ఒక హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మాత్ర తీసుకోవడం వల్లనే కరోనా నుంచి రికవరీ అయినట్లు చెప్పారు. ప్రస్తుతానికి హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కు ప్రత్యామ్నాయం మరొకటి లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పారు. ఈ మెడిసిన్ ను విమర్శిస్తున్న వారంతా ప్రత్యామ్నాయం చూపించాలని ఆయన సవాల్ విసిరారు.

    కరోనా సోకక ముందు ఎలాంటి మాస్క్ పెట్టుకోకుండా తిరిగిన అధ్యక్షుడు ప్రస్తుతం మాస్క్ పెట్టుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తుండటం విశేషం. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మెడిసిన్ ను సంజీవనిగా వర్ణించడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియాలో ఈ మందును మలేరియా నివారణలో ఉపయోగిస్తుండగా ప్రస్తుతం కరోనా నివారణలో ప్రధానంగా వాడుతుండటం గమనార్హం.