చిన్నచిన్న తప్పులకు అరెస్టులు చేయకూడదా ఉమా?

మీడియా ముందుకు నేతలు వచ్చే టప్పుడు సమగ్ర సమాచారంతో రావాలి. ఓ నేత మీడియా సాక్షిగా చేసే వివరణైనా, ఆరోపణ అయినా కనీస లాజిక్ ఫాలో కావాలి. లేదంటే…సామాన్యుడు కూడా నవ్విపోతాడు. గత రాత్రి తమిళ నాడు బోర్డర్ ఆరుంబాక సమీపంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కారులో రూ. 5కోట్లకు పైగా సొమ్ము పట్టుబడింది. అది వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనం అని, రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పక్క రాష్ట్రలకు తరలిస్తున్నారని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : July 17, 2020 9:47 am
Follow us on


మీడియా ముందుకు నేతలు వచ్చే టప్పుడు సమగ్ర సమాచారంతో రావాలి. ఓ నేత మీడియా సాక్షిగా చేసే వివరణైనా, ఆరోపణ అయినా కనీస లాజిక్ ఫాలో కావాలి. లేదంటే…సామాన్యుడు కూడా నవ్విపోతాడు. గత రాత్రి తమిళ నాడు బోర్డర్ ఆరుంబాక సమీపంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కారులో రూ. 5కోట్లకు పైగా సొమ్ము పట్టుబడింది. అది వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనం అని, రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పక్క రాష్ట్రలకు తరలిస్తున్నారని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగంలోకి దిగారు. గత ఏడాదిన్నరగా వైసీపీ నేతలు, రాష్ట్రాన్ని దోచుకున్నారని…ఆ దోచుకున్నది పక్క రాష్ట్రంలో దాచుకోవడానికి వెళుతూ వీరి అదృష్టం బాగోక పట్టుబట్టారని అన్నారు.

వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆయుధం అదే?

కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుండి, తమ రాష్ట్రానికి నగదు అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో వీరిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తమిళనాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అన్నారు. మంత్రి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఓ రెండు మినీ వ్యానుల నిండా డబ్బు నింపుకొని ముందు వెళ్లారని, ఆ వాహనాలలో పట్టక మిగిలిన సొమ్ము రూ. 5.5 కోట్లు వెనుక కార్ లో తీసుకెళుతూ పట్టుబడ్డారు అన్నారు. మరి బోండా ఉమా చెప్పినట్లు పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులు, వేల కోట్లు ఉన్న మినీ వ్యానులను ఎందుకు వదిలేశారు? కేవలం రూ. 5.5 కోట్ల వున్న వాహనం ఎందుకు పట్టుకున్నారనే దానికి ఆయనే సమాధానం చెప్పాలి. నాలుగు నెలలుగా కరోనా వలన కనీస ఆదాయం లేక అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం వేల కోట్ల దోపిడీ చేయడం సాధ్యమేనా? అనేది ఆయనకే తెలియాలి.

ఆంధ్రలో ఎన్ని జిల్లాలు వుండాలి?

ఇక గౌరవనీయులు బోండా గారు తమ టీడీపీ నేతలు చిన్న చిన్న తప్పులు చేశారని, వాటికి అరెస్టులు చేస్తారా అని అడగం ఆయన అవివేకానికి నిదర్శనంగా ఉంది. తప్పు చిన్నదైనా పెద్దదైనా శిక్షలు ఉంటాయని మరి బోండా ఉమకు తెలియదనుకుంటా? తమ నేతలు తప్పు చేశారని ఉమా ఒప్పుకున్నారు. కాబట్టి అవి చిన్న తప్పులో పెద్ద తప్పులో విచారణలో తేలుతుంది. అప్పటి వరకు వేచి చూస్తే సరిపోతుంది కదా. మరి బోండా దృష్టిలో వందల కోట్ల కుంభకోణాలు, నేతల హత్యలు చాలా చిన్న చిన్న తప్పులేమో?. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఎన్నో చేశాం ఆమాత్రానికే అరెస్ట్ చేస్తారా అన్నట్లుంది ఉమా వ్యవహారం.