సీఎం జగన్ సంక్షేమ పధకాలు ఒకవైపు, టీడీపీ నేతల వరుస అరెస్టులు మరో వైపు బాబును బెంబేలిస్తున్నాయి. బాబు రాజకీయానికి భిన్నంగా… ‘ప్రజలకు మంచి ప్రత్యర్థులకు పంచ్’ అన్నట్లు జగన్ పాలన సాగుతుంది. టీడీపీ ఎన్ని విమర్శలు, యాగీ చేసినా జగన్ తన ఒక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవడం లేదు. అనుకున్నదే తడవుగా ముందుకు వెళుతున్నాడు. టీడీపీ నాయకుల అరెస్టులపై ఆ పార్టీ నేతలు అనేక విమర్శలు చేశారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెమ్ నాయుడు మరియు వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టు అయిన కొల్లు రవీంద్రా విషయంలో బీసీ కార్డు బాబు ఉపయోగించారు. ఇది బీసీ నేతల అణచివేతలో భాగమే అని బీసీ నేతల చేత జగన్ పై తీవ్ర విమర్శలు చేయించారు. వాటి వలన టీడీపీపై సానుభూతి కానీ, వైసీపీపై వ్యతిరేకత కానీ ప్రజల్లో రాలేదు.
ఈ దెబ్బతో జగన్ బీజేపీతో కలుస్తాడా?
ఇక జగన్ ఏడాది పాలనపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు, టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రపై ప్రజల ఆలోచనకు సంబంధించిన సర్వే రిపోర్టులు తెప్పించుకున్న బాబు షాక్ కి గురయ్యారని తెలుస్తుంది. జగన్ పాలనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజలపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయట. అలాగే సంక్షేమ పధకాలు పరుగులు పెట్టిస్తున్న జగన్ గ్రాఫ్ ప్రజల్లో బాగా పెరిగిందని ఆ రిపోర్టుల సారాంశం. దీనితో ఇదే పరిస్థితి వచ్చే నాలుగేళ్ళ వరకు కొనసాగితే టీడీపీ గెలవడం అటుంచితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధం అవుతుందని ఆయన అనుకుంటున్నారట. అందుకే బాబు, జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి మరింత ఉధృతం చేయాలని నేతలకు పిలుపునిస్తున్నారట.
ఆంధ్రలో ఎన్ని జిల్లాలు వుండాలి?
మరోవైపు భవిష్యత్ లో అనేక మంది టీడీపీ మాజీ మంత్రుల అరెస్టులు తప్పవని తెలుస్తుండగా, బాబు చెప్పినట్లు దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. జగన్ పై దాడి పక్కన పెట్టిన సదరు నేతలు ఆత్మసంరక్షణలో పడ్డారట. ఏదిఏమైనా బాబు మాత్రం వచ్చే నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేయాలని నిశ్చయించుకున్నారట.అవకాశం ఉన్న ప్రతి పథకం మరియు జగన్ నిర్ణయంలో లొసుగులు వెతికి విమర్శల దాడి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రాంతీయ అసమానతలు, విభేదాలు అంటూ విమర్శలు గుప్పించే అవకాశం కలదు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో జగన్ పాలనపై సదాభిప్రాయం ఉన్నంత కాలం బాబు ఎన్ని విమర్శలు చేసినా ఫలితం శూన్యమే.