https://oktelugu.com/

జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!

కొద్దిరోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. సొంత పార్టీ నేతలపై మరియు ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన వ్యతిరేక వ్యాఖ్యలు శృతి మించడంతో పార్టీ క్రమ శిక్షణా చర్యలకు సిద్ధమైంది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ…వైసీపీ పార్టీ తరపున ఎంపీ విజయ సాయి రెడ్డి ఆయనకు షోకాజ్ నోటీసులు పంపించారు. తనకు వచ్చిన షోకాజ్ నోటీస్ లెటర్ హెడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 10:00 AM IST
    Follow us on


    కొద్దిరోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. సొంత పార్టీ నేతలపై మరియు ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన వ్యతిరేక వ్యాఖ్యలు శృతి మించడంతో పార్టీ క్రమ శిక్షణా చర్యలకు సిద్ధమైంది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ…వైసీపీ పార్టీ తరపున ఎంపీ విజయ సాయి రెడ్డి ఆయనకు షోకాజ్ నోటీసులు పంపించారు. తనకు వచ్చిన షోకాజ్ నోటీస్ లెటర్ హెడ్ పై ఉన్న పార్టీ పేరుపై అభ్యంతరం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పిర్యాదు చేశారు.

    అప్పలరాజుకు మంత్రి యోగం?

    ఐతే ఇంత గోల చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట తీరు, ఓ పక్క గిల్లుతూనే…మరో ప్రక్క చక్కిలిగిలి పెడుతున్నట్లు ఉంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రఘురామ కృష్ణం రాజు, తానూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకిని కానీ, పార్టీకి కాదు అన్నారు. నేను పార్టీకి మరియు పార్టీ నిర్ణయాలకు నిబద్ధుడను, పార్టీ అధినేత జగన్ కి విధేయుడను అంటున్నారు. ఐతే ప్రభుత్వంలో లోపాలను మాత్రం ప్రశ్నిస్తాను అన్నారు. ఆయన దృష్టిలో పార్టీ వేరు, ప్రభుత్వం వేరట. నిజానికి ఇది నిజమే అయినా…పార్టీ నాయకుడే ప్రభుత్వాది నేత కాబట్టి పార్టీకి మించిన గౌరవం ప్రభుత్వానికి ఇవ్వాలి.

    నాని మౌనం వెనుక కారణాలెంటీ?

    కానీ రఘురామ కృష్ణం రాజు అలా ఆలోచించడట. ప్రభుత్వ లోపాల్ని లేవనెత్తుతాడట. దాని వెనుక కారణం వైసీపీ పార్టీ మంచి కోరడమేనట. మెరుగైన పాలన అందించి, వైసీపీ మరో 25ఏళ్ళు అధికారంలో ఉండాలట. అందుకే ఆయన అలాంటి విమర్శలు చేస్తున్నాను అన్నారు. ఇక పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిరంగంగా ఎందుకు చెబుతున్నారని అడుగగా..మీడియాను ఉద్దేశిస్తూ… మీరే నాతో చెప్పిస్తున్నారు. మాట్లాడకపోతే ఒక తంటా.. మాట్లాడితే ఒక తంటా అని తనధైన శైలిలో మీడియాకు కూడా చురక వేశాడు రఘురామ కృష్ణం రాజు.