Blackout crisis in India: దేశాన్ని ఓ పెను ఉప్పెన భయపెడుతోంది. చరిత్రలో రానటువంటి సమస్య భారత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు అలాంటిది ఏమీ లేదంటూనే కేంద్ర సర్కారు సర్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఇంతటి పరిస్థితికి కారణం ఏంటనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఎలాగైనా సంక్షోభం మరింత ముదరకముందే తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన కేంద్రం విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచిస్తోంది. ఇంతకీ ఎంటా సంక్షోభం అనుకుంటున్నారా..? మన నిత్యవసరాల్లో ఒకటైన విద్యుత్.. అవును దేశంలో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం భయపెడుతోంది. నాలుగైదు రోజులుగా పత్రికల్లో, టీవీల్లో, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త భారతదేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయని.. కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డిమాండ్ పెరిగి సప్లయి తగ్గుతోందనే వార్తలు జోరందుకోగా.. విద్యుత్ సంక్షోభం ఏర్పడితే పరిస్థితి ఏంటని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కారుచీకట్లు కమ్ముకొస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యుత్ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై ఫోకస్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధిత మంత్రులతో అత్యవసర భేటీ అయ్యారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించిన ఆయన బొగ్గుకొరత ఎందుకు ఏర్పడుతోందనే అంశంపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లలో పదిహేను రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంటుంది. తద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుంది. అయితే చాలా ప్లాంట్లలో మూడు రోజులకు మించిన నిలువలు లేవనేది ఆందోళన కలిగిస్తున్న అంశం.దీంతో థర్మల్ ప్లాంట్ల నిర్వహణపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది.
అయితే దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిపోవడానికి కారణం ఏంటనే అంశంపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై ఆందోళన చెందుతున్న పలు రాష్ర్టాల సీఎంలు కేంద్రానికి లేఖ రాశారు. సంక్షోభం నుంచి గట్టేక్కే ప్రయత్నం చేయండంటూ అందులో పేర్కొన్నారు. నిత్యం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలతో కేవలం సగం మాత్రమే సాధ్యం అవుతోందని కేంద్రమంత్రి తెలిపారు. విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కోతులు విధిస్తున్నాయి. ప్రతీ రాష్ట్రంలోనూ నాలుగు నుంచి ఎనిమిది గంటల విద్యత్ కోతుల నిత్యం విధిస్తుండడంతో కొంతలో కొంతైనా కరెంటును పొదుపుగా వాడుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తెలంగాణలోని సింగరేణి మాత్రంలో బొగ్గు ఉత్పత్తిలో విఘాతం లేదని.. సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని.. ఇదీ కేవలం పుకారు మాత్రమే అంటూ సంస్థ కొట్టిపడేస్తోంది.