https://oktelugu.com/

Rajanikath: దసరాకు ‘అన్నాత్తై’ సందడి షురూ

Rajanikath: పండగ వచ్చిందంటే చాలు ఇంట్లో బంధువులతో పాటు, కొత్త సినిమాలూ సందడి చేయడానికి సిద్ధమవుతాయి. ఈ ఏడాది దసరా వేడుకలను పురస్కరించుకుని అభిమానులకు హుషారు పెంచేందుకు స్టార్​ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్​ స్టార్​ రజనీకాంత్​ హీరోగా వస్తోన్న ‘అన్నాత్తై’ నుంచి కొత్త అప్​ డేట్​ తీసుకోచ్చింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్​ని అక్టోబర్​ 14న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో తలైవా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.   శివ దర్శకత్వంలో సన్​ పిక్చర్స్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 12, 2021 / 10:09 AM IST
    Follow us on

    Rajanikath: పండగ వచ్చిందంటే చాలు ఇంట్లో బంధువులతో పాటు, కొత్త సినిమాలూ సందడి చేయడానికి సిద్ధమవుతాయి. ఈ ఏడాది దసరా వేడుకలను పురస్కరించుకుని అభిమానులకు హుషారు పెంచేందుకు స్టార్​ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్​ స్టార్​ రజనీకాంత్​ హీరోగా వస్తోన్న ‘అన్నాత్తై’ నుంచి కొత్త అప్​ డేట్​ తీసుకోచ్చింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్​ని అక్టోబర్​ 14న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో తలైవా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

     

    శివ దర్శకత్వంలో సన్​ పిక్చర్స్​ పతాకంపై కళానిధి మారన్​ నిర్మిస్తున్న సినిమా ఇది. రజనీకాంత్​కు జోడీగా నయనతార నటిస్తున్నారు. కీర్తిసురేశ్​, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్​ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె రజని నటించిన కబాలి, పేటా వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు ధరిస్తూ.. అభిమానులను అలరించారు. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్​ కానప్పటికి.. మంచి టాక్​ తెచ్చుకున్నాయి. రజనీ హీరోగా చివరగా వచ్చిన చిత్రం దర్బార్​. పోలీస్​గా చెలరేగిపోయి తనలో యవ్వనం అలాగే ఉందని నిరూపించారు.

    మరి అన్నాత్తై లో తలైవా లుక్​ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా టీజర్​ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు రోబో తర్వాత పెద్దగా హిట్​ సాధించని రజనీ.. ఈ సినిమాతోనైనా రికార్డు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.