
కరోనాతోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పోరాడుతుంటే ఇప్పుడు మరో రోగం బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది. దీంతో తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా రాష్ర్టాలు బ్లాక్ ఫంగస్ మహమ్మారి వ్యాపించిందని ప్రకటించాయి. దీంతో కేంద్రం రాష్ర్టాలకు పలు సూచనలు చేసింద. బ్లాక్ ఫంగస్ మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. దీంతో బ్లాక్ ఫంగస్ పై రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలా ఎదుర్కోవాలి? ఏం చికిత్స తీసుకోవాలి? తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మందులేని వ్యాధి బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్ కు మందులు లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తలే శరణ్యమని భావిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత ఆరోగ్య శాఖకు రిపోర్టు చేయాలని సూచించారు. రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే చెప్పాలని కోరింది. బ్లాక్ ఫంగస్ కేసులు భారత్ లోనే ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. తెలుగు రాష్ర్టాల్లో కూడా బ్లాక్ ఫంగస్ భయపెడుతోందని పేర్కొన్నారు. దీనికి సరైన మందులు లేకపోవడంతోనే ప్రజల్లో భయాందోళన పెరిగింది.
బహుళ విధాల చికిత్స
బ్లాక్ ఫంగస్ నిర్మూలనకు బహుళ విధాల చికిత్స అవసరమవుతుంది. దీనికి కంటి, ఈఎన్టీ, జనరల్ సర్జన్, న్యూరో, డెంటల్ స్పెషలిస్టులు కావాల్సి ఉంటుంది. యాంటీ ఫంగల్ మెడిసిన్ ఎంఫోటెరిసిన్ వినియోగించాల్సి ఉంటుంది. ఎపిడెమిక్ చట్టం ద్వారా వ్యాధిని నయం చేయడానికి వీలుంటుంది. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను సైతం వడుద ల చేసింది.
ఎవరికి వస్తుంది?
స్టెరాయిడ్స్ వాడిన వారు, మధుమేహం అదుపులో లేని వారికి బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ర్టలో 1500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 90 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. రాజస్థాన్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కేంద్రం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా ప్రకటించింది.