BJP 3rd List : తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో వెనుకబడింది. అధికార బీఆర్‌ఎస్ నెల క్రితమే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎట్టకేలకు బీజేపీ మూడో జాబితా ఓ అంచానాకు వచ్చింది. ఇప్పటికే 52 మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ తర్వాత ఒక అభ్యర్థి పేరుతో రెండో లిస్ట్ విడుదల చేసింది. తాజాగా 58 మందితో మూడు జాబితా రెడీ చేసినట్టు తెలిసింది. ఆ జాబితా తాజాగా లీక్ అయ్యింది. దీంతో మొత్తం 111 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. సాయంత్రం వరకు జాబితా రిలీజ్ అయ్యే అకవకాశం ఉంది.
జనసేనకు 8 స్థానాలు..
పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ తెలంగాణలో ఎనిమిది స్థానాలు కేటాయించనున్నట్టు సమాచారం.. హైదరాబాద్‌లో రెండు సీట్లు మాత్రమే ఇచ్చింది. కూకట్‌పల్లితోపాటు, తాండూర్ జనసేనకు కేటాయించింది. మెదక్, నాగర్‌కర్నూరల్, కోదాడ, పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులను రేపు ప్రకటిస్తారని సమాచారం.
బీజేపీ జాబితా ఇదే(అంచనా)
1. ఆసిఫాబాద్ –తుకారాం
2. చెన్నూర్ –అందుగుల శ్రీనివాస్
3. మంచిర్యాల –రఘునాథబాబు
4. బాన్సువాడ – మాల్యాద్రి రెడ్డి
5. బోధన్ – మేడపాటి ప్రకాశ్ రెడ్డి,వడ్డి మోహన్ రెడ్డి
6. నిజామాబాద్ రూరల్ – దినేష్
7. ఎల్లారెడ్డి – పైలా కృష్ణారెడ్డి
8. మంథని– చందుపట్ల సునీల్ రెడ్డి
9 పెద్దపల్లి – గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి/నల్ల మనోహర్‌రెడ్డి
10. వేములవాడ –వికాస్‌రావు/తుల ఉమ
11. జహీరాబాద్ – ఢిల్లీ వసంత్
12. సంగారెడ్డి – పులిమామిడి రాజు
13. నారాయణ ఖేడ్ – విజయపాల్‌రెడ్డి
14 . ఆందోల్ – బాబు మోహన్∙
15 . హుస్నాబాద్ – బొమ్మ శ్రీరాంచక్రవర్తి/ జేఎస్‌ఆర్
16. సిద్దిపేట – దూది శ్రీకాంత్ రెడ్డి
17. షాద్ నగర్ – శ్రీవర్దన్‌రెడ్డి/అందె బాబయ్య
18 . ఎల్బీనగర్– సామారంగారెడ్డి
19. రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
20. శేరిలింగంపల్లి– రవికుమార్ ¶æూదవ్,
21 .చేవెళ్ల– కేఎస్.రత్నం
22. వికారాబాద్ – తులసి విజయరాం
23. కొడంగల్ – చికోటి ప్రవీణ్
24. మేడ్చల్ –విక్రంరెడ్డి/సుదర్శన్‌రెడ్డి
25. మల్కాజ్‌గిరి – ఆకుల రాజేందర్
26. ఉప్పల్ –ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
27. ముషీరాబాద్ – పాపారావు/బండారు విజయలక్ష్మి
28. మలక్‌పేట – లింగాల హరిగౌడ్/కొత్తకాపు రవీందర్‌రెడ్డి
29 . అంబర్‌పేట – గౌతం రావు
30. జూబ్లీహిల్స్ – జూటూరి కీర్తిరెడ్డి
31. సనత్ నగర్ –మర్రిశశిధర్‌రెడ్డి
32. నాంపల్లి – విక్రమ్‌గౌడ్
33. సికింద్రాబాద్ –బండ కార్తీకరెడ్డి
34. కంటోన్మెంట్– సుష్మిత( శంకర్‌రావు కూతురు)
35. జడ్చర్ల –చిత్తరంజన్‌దాస్
36. దేవరకద్ర– పవన్‌కుమార్ రెడ్డి
37. అచ్చంపేట–సతీశ్ మాదిగ
38. వనపర్తి – అశ్వద్ధామరెడ్డి
39. గద్వాల – స్నిగ్ధ రెడ్డి
40. అలంపూర్– కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం
41. నకిరేకల్ – పాల్వాయి రజని
42. నల్గొండ – శ్రీనివాస్‌గౌడ్
43. మునుగోడు – బూర నర్సయ్యగౌడ్
44. దేవరకొండ – లాలూనాయక్
45. మిర్యాల గూడ –సాదినేని శ్రీనివాస్
46. హుజూర్ నగర్ – చల్ల శ్రీలత రెడ్డి
47. తుంగతుర్తి – కడియం రామచంద్రయ్య
48. ఆలేర్ – కాసాం వెంకటేశ్వర్లు
49. నర్సంపేట – పుల్లారావు చౌదరీ
50. పరకాల –విజయచందర్‌రెడ్డి/కాళీ ప్రసాద్
51. కొత్తగూడెం– శీలం పాపారావు/రంగా కిరణ్
52. ఖమ్మం – గల్లా సత్యనారాయణ చౌదరి/డి సత్యనారాయణ యాదవ్
53. పాలేరు – కొండపల్లి శ్రీధర్ రెడ్డి
34. మధిర – అజయ్‌రాజ్,
55. సత్తుపల్లి – శ్యామ్ నాయక్
56. ములుగు – అజ్మీరా ప్రహ్లాద్/కృష్ణ
57. మక్తల్ –జలంధర్ రెడ్డి
58. నారాయణ్ పేట–రతన్ పాండురంగారెడ్డి