Hardik Pandya: పాండ్య వచ్చేస్తున్నాడు ఎవరి మీద వేటు పడబోతోంది అంటే..?

హార్దిక్ పాండ్య టీంలో లేకపోవడంతో న్యూజిలాండ్ మీద ఇంగ్లాండ్ మీద జరిగిన రెండు మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ ని అతని ప్లేస్ లో రీప్లేస్ చేయడం జరిగింది. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ మీద 5 వికెట్లు తీశాడు.

Written By: Suresh, Updated On : November 1, 2023 1:52 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వరుస మ్యాచ్ ల్లో విజయాలను సాధిస్తుంది.ఇక అందులో భాగంగానే ఇండియా తన నెక్స్ట్ మ్యాచ్ ని శ్రీలంక తో ఆడుతుంది కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద చాలా రకాలైన చర్చలు నడుస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ని ఓడించడానికి శ్రీలంక టీమ్ కూడా చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది కానీ ఇండియన్ టీమ్ ని ఓడించాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న శ్రీలంక టీం వల్ల కాదు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే ఇండియాని ఓడించాలి అంటే పెద్ద పెద్ద టీం ల వల్లే కావడం లేదు ఈ బచ్చా శ్రీలంక వల్ల ఏమవుతుంది అంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయానికి గురైన హార్థిక్ పాండ్య ప్రస్తుతం కోలుకొని నెట్ ప్రాక్టీస్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. హార్దిక్ పాండ్య టీంలో లేకపోవడంతో న్యూజిలాండ్ మీద ఇంగ్లాండ్ మీద జరిగిన రెండు మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ ని అతని ప్లేస్ లో రీప్లేస్ చేయడం జరిగింది. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ మీద 5 వికెట్లు తీశాడు, ఇంగ్లాండ్ మీద 4 వికెట్లు తీసి ఇండియన్ టీం లో టాప్ ప్లేయర్ గా నిలిచాడు.

ఇక ఇప్పుడు హార్థిక్ పాండ్య టీం లోకి వస్తే ఎవరిని పక్కన పెడతారు అనే విషయం మీద చాలా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ న్యూజిలాండ్ మీద ఆడిన మ్యాచ్ లో రన్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ మ్యాచ్ లో మాత్రం 49 రన్స్ చేసి కీలకమైన సమయంలో మ్యాచ్ ని ఆదుకున్నాడు.ఇక ఇలాంటి సమయంలో సూర్య కుమార్ యాదవ్ ని తీసేయడం సరికాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఫేస్ బౌలర్లలో ఒకరైన మహమ్మద్ సిరజ్ పక్కన పెట్టి ఇద్దరు పేస్ బౌలర్ల ను ఆడిస్తూ హార్థిక్ పాండ్య ని టీం లోకి తీసుకోవాలి.

ఇక ఇలాంటి సమయం లో హార్ధిక్ పాండ్య చేత మొత్తం ఫుల్ ఓవర్లు ఆడించాల్సి ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఇది కూడా సాధ్యం కాని విషయం అనే చెప్పాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే సూర్య కుమార్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ని పక్కన పెట్టడం అంటే కరెక్ట్ విషయం కాదు ఇక ఇంకో విషయం ఏంటంటే శ్రేయాస్ అయ్యర్ పెద్దగా రాణించలేకపోతున్నాడు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి సూర్య కుమార్ యాదవ్ నెంబర్ 4 లో ఆడించి హర్ధిక్ పాండ్య ని నెంబర్ 6 లో ఆడిస్తే బెటర్ అని చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే నెంబర్ 4 లో సూర్య ఎంతవరకు రాణిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా ఎవరిని తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది…